కల్లూరులో మినీ స్టేడియంను ప్రారంభించిన

Spread the love

రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

సత్తుపల్లి నియోజకవర్గం లోని కల్లూరు మండలంలో మూడు కోట్ల 40 లక్షల రూపాయల నిధులు వెచ్చించి నిర్మించిన మినీ స్టేడియంను తెలంగాణ రాష్ట్ర క్రీడ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో ఆయనతో పాటుగా పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య జిల్లా కలెక్టర్ వి.పి.. గౌతమ్ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వేసవి శిక్షణ శిబిరాలు, క్రీడాకారులు క్రీడాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రీడా కోటాలో ఉద్యోగం సాధించేలా ప్రతి క్రీడాకారుడు ఆ దిశగా ప్రయత్నం చేయాలన్నారు. ఆటల్లో నైపుణ్యం పెంపొందించుకొని మెరుగైన ప్రతిభను కనబరచాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి చేస్తుందన్నారు. క్రీడల అభివృద్ధికి ప్రత్యేకంగా దృష్టి సారించింది అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు దరిచేరేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వంతోనే సామాజిక న్యాయం అందుతుందన్నారు.


జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ మాట్లాడుతూ సత్తుపల్లి శాసనసభ్యులు, అధికారుల చొర్వతో ఒక సంవత్సరం లోనే మినీ స్టేడియం ప్రారంభించు కోగాలిగమని, క్రియాశీలక పాత్ర వహింంచిన అధికారులను అభినందించారు. గతంలో కళాశాల స్థాయి క్రీడాకారులుకు స్టేడియం వారికే అవకాశం ఉండేది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రరాలు మాత్రమే కాకుండా నియోజక వర్గాలలో స్టేడియం నిర్మాణాలు చెప్పటిందని ఫుట్బాల్, వాలీబాల్, కోకో ఓపెన్ జిమ్ కబడ్డీ, బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్, చెస్, బాస్కెట్బాల్, అథ్లెటిక్స్ క్రీడాలకు అవకాశం కల్పించిందని, క్రీడాకారులు ఇట్టి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఉమామహేశ్వ రరావు, జడ్.పి. టి.సి.అజయ్ కుమార్, ఎమ్. పి పి.రఘు, సర్పంచ్ నీరజ, రెవిన్యూ డివిజన్ అధికారి సూర్య నారాయణ, జిల్లా విద్యా శాఖ అధికారి సోమశేఖర్ శర్మ, జిల్లా క్రిడల శాఖధికారి పరందంరెడ్డి, సత్తుపల్లి పంచాయతీ రాజ్ ఇ.ఇ.చంద్రమౌళి, అర్ అండ్ బి.ఇ.ఇ.హేమలత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page