విద్యార్థుల ఆజ్ఞానపు చీకట్లను తొలగించే గురువులకు ఘన సన్మానం..
సాక్షిత : ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను సన్మానించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ….
ఈ నెల ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని ప్రభుత్వ పాఠశాలలో భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ పదానికి పర్యాయ పధంగా నిలిచి, భారత రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు అలంకరించిన భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా టీచర్స్ డే ను నిర్వహిస్తామని తెలియజేసారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ధి , యువతను అత్యున్నత శిఖరాలను చేరవేస్తున్న గురువులందరికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో PACS డైరెక్టర్ సత్తిరెడ్డి , సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి , BRS పార్టీ 16వ వార్డ్ కమిటీ అధ్యక్షులు మన్నె శేఖర్ ముదిరాజ్ , నాయకులు కటకం విరేష్ , వెంకట్ , ప్రభు మరియు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామిరెడ్డి , ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయని ప్రభావతి , ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల ఆజ్ఞానపు చీకట్లను తొలగించే గురువులకు ఘన సన్మానం..
Related Posts
కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించండి
SAKSHITHA NEWS కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించండి..ఎమ్మెల్యే జిఎంఆర్ కు వినతిపత్రం అందించిన బీరంగూడ వాసులు అమీన్పూర్ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం బీరంగూడ ప్రాంతానికి చెందిన పుర ప్రముఖులు,…
ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం
SAKSHITHA NEWS ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు బాలికల వసతి గృహంలో ఘటన.. నిందితుడి అరెస్టు హైదరాబాద్ శివారులో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని అత్యాచారానికి గురైంది. రాత్రి వేళ ప్రైవేటు గర్ల్స్ హాస్టల్లోకి ప్రవేశించిన యువకుడు.. గదిలో ఒంటరిగా…