యస్.బి.ఐ.టి. లో ముగిసిన ఐదు రోజుల కమ్యూనికేషన్ & సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ కార్యక్రమం
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ఉద్యోగ సాధనలో విద్యతోపాటు కమ్యూనికేషన్ & సాఫ్ట్ స్కిల్స్ ప్రాముఖ్యమని యస్.బి.ఐ.టి. కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్ & సాఫ్ట్ స్కిల్స్ పై కూడా పట్టు సాధించాలని తద్వారా అత్యధిక ప్లేస్మెంట్స్ పొందగలరని వారు తెలిపారు.
గత ఐదు రోజులుగా విద్యార్థులకు “ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్” పై అవగాహన కల్పిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా॥ జి. ధాత్రి తెలిపారు. గ్రూప్ డిస్కషన్స్, రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, సెల్ఫ్ ఇంట్రోడక్షన్ మరియు ఇంటర్వూస్కిల్స్ పై అవగాహన కల్పించినట్లు వారు తెలిపారు. బహుళజాతి కంపెనీలలో, క్లైంట్స్తో సంభాషించుటలో భావవ్యక్తీకరణ కీలకమని వారు తెలిపారు.
వివిధ బహుళజాతి కంపెనీ ఉద్యోగులకు శిక్షణను ఇచ్చిన అనుభవం కలిగిన ట్రైనర్ ఆతోషిరాయ్ ద్వారా తమ విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ పై శిక్షణ కల్పించామని, తద్వారా తమ విద్యార్థులలోని ఇన్ఫిరియారిటీ ని తగ్గించగలిగామని కళాశాల ప్రిన్సివల్ డా|| జి. రాజ్ కుమార్ తెలిపారు. గ్రూప్ గా ఉన్నప్పుడు అందరిలో తమ భావాన్ని వ్యక్తీకరించడం, స్టేజ్ ఫియర్ని ఎదుర్కోవడం వంటి కీలక అంశాలపై విద్యార్థులచే ప్రెజెంటేషన్ ఇప్పంచామని వారు తెలిపారు. అనంతరం ట్రైనర్ ఆతోషిరాయ్ను వారు సన్మానించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అకడమిక్ డైరెక్టర్స్ గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, డా॥ ఎ.వి.వి. శివ ప్రసాద్, డా॥ యన్. శ్రీనివాసరావు, డా॥ కె. అమిత్ బంధాజ్, డా॥ జె. రవీంద్రబాబు, టి.పి.ఒ. యన్. సవిత, కోఆర్డినేటర్ జి. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.