దరిపల్లి కళాశాలలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్;
స్థానిక ఖమ్మం రూరల్ మండలం సత్య నారాయణపురం కొత్తూరు గ్రామ శివారులో గల దరిపల్లి అనంత రాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ డేర్ కళాశాల నందు అనగా 25/10/2024 తారీఖున ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల జె.బి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (యుజి సి అటానమస్ కళాశాల), హైదరాబాద్ వారితో ఏఐసిటిఈ మార్గదర్శన్ లో భాగంగా డేర్ కళాశాలలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంను నిర్వహించినారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన జెబిఐటి కళాశాల అకాడమిక్ డీన్ మరియు ఏఐసిటిఈ మార్గదర్శన్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎం.డి సలావుద్దీన్ వారు మాట్లాడుతూ ఏఐసిటిఈ వారి మార్గదర్శన్ ప్రోగ్రాం లో భాగంగా డేర్ కళాశాలకి అవసరమైన నాక్, ఎన్ బీఏ అసెస్మెంట్ మరియు ఎన్ ఐ ఆర్ ఎఫ్, టైమ్స్ నౌ ర్యాంకింగ్ కొరకు కావలసిన టెక్నికల్ పర్యవేక్షణ కోసం జెబిఐటి కళాశాల వారితో అవగాహన ఒప్పందం కుదిరిందని తెలియజేసినారు.
అంతే కాకుండా ఫ్యాకల్టీకి మంచి ఫ్యాకల్టీగా ఎదగడానికి కావలసిన క్రియేటివిటీ, కమ్యూనికేషన్స్ స్కిల్స్, లర్నింగ్ అవుట్ కం, కెరీర్ డెవలప్మెంట్, పేపర్ పబ్లికేషన్స్ ను అలవర్చుకోవాలని, కళాశాలకి అవసరమైన మంచి ప్లేస్మెంట్ సదుపాయాలు, హయ్యర్ స్టడీస్ ఆపర్చునిటీస్, ఎంటర్ప్రైన్షిప్ ను విద్యార్థిని విద్యార్థులకు అందించాలని సూచించారు. అంతే కాకుండా స్లో లెర్నర్ మరియు అడ్వాన్స్డ్ లర్నర్ గురించి ఏ విధంగా ఫ్యాకల్టీ విద్యార్థిని విద్యార్థులకు అవగాహన చేయాలని తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో దరిపల్లి విద్యాసంస్థల అధినేత మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ దరిపల్లి కిరణ్, కళాశాల కరస్పాండెంట్ దరిపల్లి స్వాతి, అకడమిక్ ఇంచార్జ్ డాక్టర్ శిరీష, ప్లేస్మెంట్ ఆఫీసర్ సతీష్, ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ ఎస్.కె హమీదుల్ల, ఎన్ఎస్ఎస్ మరియు యుబిఏ కోఆర్డినేటర్ రమ్యశ్రీ, వివిధ విభాగాల అధిపతులు రవికుమార్, రమేష్, ఎంబీఏ ఫ్యాకల్టీ రవి, ప్రవీణ్, పుల్లయ్య, సంజన, నవీన్, కళాశాల టెక్నికల్ స్టాఫ్ విద్యాసాగర్, మౌనిష, లక్ష్మణ్, త్రివేణి మరియు తదితరులు పాల్గొన్నారు.