విజయవాడ : విజయవాడ ముత్యాలంపాడులోని సాయిబాబా మందిరం అభివృద్ధికి, అక్కడ భిక్షమెత్తుకుంటూ జీవిస్తున్న యాదిరెడ్డి రూ.లక్ష విరాళం అందజేశారు. నగదును శుక్రవారం మందిరం గౌరవాధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా యాదిరెడ్డి మాట్లాడుతూ తాను మందిరం వద్ద భిక్షాటన చేసి సంపాదించిన మొత్తాన్ని స్వామికే ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. తన జీవితం బాబాకే అంకితమని, భవిష్యత్తులో తాను సంపాదించిన ప్రతి రూపాయీ దైవకార్యాలకే వినియోగిస్తానని చెప్పారు. ఇప్పటి వరకు యాదిరెడ్డి బాబా మందిరానికి రూ.8.54 లక్షల విరాళం ఇచ్చారని గౌతమ్‌రెడ్డి తెలిపారు. అనంతరం యాదిరెడ్డిని సత్కరించారు.
రూ.లక్ష విరాళం
Related Posts
విశాఖలో ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక జాతికి అంకితం
SAKSHITHA NEWS విశాఖలో నేడు ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక జాతికి అంకితం విశాఖపట్నం : ఏపీలో నౌకాదళం హైడ్రోగ్రాఫిక్ సర్వేలకోసం ఉద్దేశించిన INS నిర్దేశక్ నౌకను జాతికి అంకితం చేయనున్నారు. విశాఖ నావెల్ డాక్ యార్డ్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి రక్షణశాఖ…
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యం
SAKSHITHA NEWS రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్ మంత్రి పొంగూరు నారాయణ తో కలిసి పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు…