SAKSHITHA NEWS

చిలకలూరిపేట పురపాలక సంఘం నందు గల పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) విభాగం ఆధ్వర్యంలో పట్టణం నందు గల ప్లంబర్స్, కార్పెంటర్లు, ఎలక్ట్రిషియన్లు, ఏసీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, వాటర్ ప్యూరిఫైయర్, గీజర్, టీవీ మెకానిక్, బ్యూటీషియన్ తో పాటు ఇతర అన్నిరకాల సేవలు అందించు వారికి హోమ్ ట్రయాంగిల్ ప్లాట్ ఫాం ద్వారా జీవనోపాధి కల్పించుటలో భాగంగా ది: 10-01-2025 తేదీన ఉదయం 10 గంటలకు మాజీ మంత్రి మరియు స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మరియు ఇతర ప్రజా ప్రతినిధులచే మునిసిపల్ కౌన్సిల్ హాల్ నందు సర్వీసు ప్రొవైడర్ల గుర్తింపు మేళా కార్యక్రమం ప్రారంభించబడును.
కావున పట్టణం నందు గల ప్లంబర్స్, కార్పెంటర్లు, ఎలక్ట్రిషియన్లు, ఏసీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, వాటర్ ప్యురిఫైయర్, గీజర్, టీవీ మెకానిక్, బ్యూటీషియన్ తో పాటు ఇతర అన్నిరకాల సేవలు అందించువారు ఈ కార్యక్రమానికి హాజరై రేషన్ కార్డ్, పాస్పోర్ట్ సైజు ఫోటో, ఆధార్, బ్యాంకు పాస్ పుస్తకం, పాన్ కార్డ్ జిరాక్సులతో వివరాలను నమోదు చేసుకోవాలని మునిసిపల్ కమీషనర్ పేర్కొన్నారు.


SAKSHITHA NEWS