SAKSHITHA NEWS

తిరుపతి జిల్లా…

మాధక ద్రవ్యాల పై ఉక్కుపాదం.

గంజాయి రవాణా మరియు విక్రయించే 12 మంది అరెస్ట్, వారి వద్ద నుండి సుమారు 21 కేజీల గంజాయి స్వాధీనం.

గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ ఓపెన్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు.

గూడూరు నగర పరిదిలో సుమారు 2,10,000/- రూపాయల విలువ గల గంజాయి స్వాధీనం.

గంజాయి రవాణా, విక్రయ ప్రాంతాలపై ప్రాంతాలపై ప్రత్యేక నిఘా.

టోల్ ఫ్రీ నెంబర్ 14500 కి మాదకద్రవ్యాల గురించి సమాచారం అందించచాలని విజ్ఞప్తి.,

జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు అక్రమ రవాణా పై దృష్టి పెట్టి విస్తృతంగా తనిఖీలు నిర్వహించి దాడులు చేసిన పోలీసులు

గూడూరు నగర పరిదిలో దుర్జటి ప్రాంతంలో చాకచక్యంగా వ్యవహరించి 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 12 మంది అరెస్ట్ చేసిన పోలీసులు

గూడూరు డిఎస్పి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సిఐ హజరత్ బాబు సెబ్ అదికారులు జానకిరామ్,విజయకుమార్, శేషమ్మ మరియు సిబ్బంది పాల్గోని దాడులు నిర్వహించరు.

జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు గూడూరు సబ్ డివిజన్ పరిధిలో గాంజా అక్రమ రవాణా పై పోలీసులు, సేబ్ అదికారులు సంయుక్తంగా విస్తృతంగా దాడులు నిర్వహించి కచ్చితమైన సమాచారం మేరకు దాడులు నిర్వహించి సుమారు 2,10,000/- రూపాయల విలువ గల 21 కేజీ ల గంజాయిని స్వాధీనం చేసుకునీ అక్రమ రవాణా మరియు విక్రయిస్తున్న12 మందిని గుర్తించి అరెస్టు చేశారు.

బుదవారం గూడూరు నగర పోలీస్ స్టేషన్లో నిర్వహించిన పత్రిక సమావేశంలో సేబ్ డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఏ.రాజేంద్ర గారు అరెస్టుకు సంబంధించిన కేసు వివరాలను వెల్లడించారు

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని కేసులలో పట్టుబడిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెడతామన్నారు ఇలాంటి అక్రమ రవాణాలో పాల్గొని భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని అక్రమ రవాణా పై ఏదైనా సమాచారం ఉంటే పోలీసు వారికి తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు.

జిల్లా వ్యాప్తంగా గాంజా, మాధక ద్రవ్యలపై పోలీసులు సేబ్ అధికారులు ఉమ్మడిగా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి ఉక్కు పాదం మోపుతున్నమని
నిషేధిత మత్తు పదార్థాలైన గంజాయి,గుట్కా ఇతర రకాల మత్తు పదార్థాలు విక్రయించినా, తరలించినా కఠిన చర్యలు తప్పవని ఈ కేసులో ప్రధాన ముఠా వారిని కూడా గుర్తించామని వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.


SAKSHITHA NEWS