పెదకూరపాడు నియోజకవర్గంలో 250 మంది యానిమేటర్లు పనిచేస్తున్నారని, వారు డ్వాక్రా గ్రూపు సభ్యులకు లోన్లు ఇప్పించటం, సబ్సిడీ పథకాలు ఇప్పించటం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందించటం వంటి కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషించుతున్నారని, డ్వాక్రా మహిళల అభ్యున్నతి పట్ల వారు చేస్తున్న కృషి ఎనలేనిదని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు.
వారు గత ప్రభుత్వంలో 3000 రూపాయల వేతనం తీసుకుంటే ప్రస్తుతం జగనన్న ప్రభుత్వములో 8000 రూపాయలు గౌరవేతనం అందుకుంటున్నామని యానిమేటర్లు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కి తమ సంతోషాన్ని తెలియచేశారు. 2021 తదుపరి నూతనంగా ఏర్పాటు అయిన గ్రామ సంఘాలలో నియమింపబడిన యానిమేటర్లు కు వేతనం అందటం లేదని, అలాగే యానిమేటర్లు అందరికి HR పాలసీని వర్తింప చేయాలని యానిమేటర్లు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ని కోరారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఈ రెండు సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి బుడి ముత్యాల నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు.