తిరుపతి నగరం
తిరుపతి నగరంలో సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే ఆడిటోరియం, వినాయక సాగర్ ప్రారంభోత్సవాలకు అన్ని ఏర్పాటు చేయాలని అధికారులను వుద్దేశించి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం అన్ని విభాగాల అధిపతులతో జరిగిన సమావేశంలో కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ వినాయక సాగర్లోని పనులన్నింటిని పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని, ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులు, ప్రజలు విచ్చేస్తారని తెలుపుతూ స్టేజి డెకరేషన్ కార్యక్రమాన్ని చక్కగా చేపట్టాలన్నారు.
అదేవిధంగా ఆర్ట్స్ డిస్టిక్ స్టూడియోలో ప్రారంభిస్తున్న ఆడిటోరియం ప్రారంభోత్సవానికి అన్ని చర్యలు తీసుకొని సిద్ధం చేయించాలన్నారు. అదేవిధంగా ఈనెల 18 ముఖ్యమంత్రి చేతుల మీదగా ప్రారంభించబోయే శ్రీనివాస సేతు పూర్తయిన పూర్తి దశ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించేలా అన్ని ఏర్పాటు చేయాలని కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేసారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, స్మార్ట్ సిటీ జి.ఎం చంద్రమౌళి, మునిసిపల్ ఇంజనీర్ చంధ్రశేఖర్, డిఈలు విజయ్ కుమార్ రెడ్డి, దేవిక, మోహన్, డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసులు రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాలసుబ్రమణ్యం, పైర్ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు