తిరుపతి నగరంలో రూపుదిద్దుకుంట్టున్న వినాయకసాగర్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేసారు. వినాయకసాగర్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను సాయంత్రం తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ పరిశీలిస్తూ నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా తీర్చిదిద్దుతున్న వినాయక సాగర్ పనులను వేగవంతం చేయాలన్నారు.
సందర్శకులను ఆకర్షించే విధంగా స్వాగత ఆర్చ్ ఏర్పాటు చేయించాలన్నారు. అదేవిధంగా వినాయకసాగర్ లోపల ఏర్పాటు చేస్తున్న ప్రదేశాల గురించి డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వినాయకసాగర్ లోపల ఏర్పాటు చేయనున్న అమ్యూజిమెంట్ పార్క్, రెస్టారెంట్, బోటింగ్ పాయింట్ల ఏర్పాట్ల పనులు పూర్తికి ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వినాయక సాగర్ లోపల చక్కని ఆహ్లాదాన్ని పంచే పచ్చదనాన్ని పెంచాలన్నారు. ఆధునిక వెలుగులు నింపే విద్యుత్ దీపాలను వినాయక సాగర్లో ఏర్పాటు చేయాలన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి వినాయక సాగరను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేసారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, డిఈ విజయ్ కుమార్ రెడ్డి, ఏయికామ్ ప్రతినిధి భాలాజీ పాల్గొన్నారు.