ఎన్ఐటీ విద్యార్థికి జాతి రత్నాలు ఫ్రెండ్స్ రూ 65000 ఆర్థిక సాయం.
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
గుజరాత్ లోని సూరత్ ఎన్ఐటిలో సీటు సాధించి ఫీజు చెల్లించడానికి ఆర్థికంగా సతమతమవుతున్న విద్యార్థి ఎన్. సాయికార్తీక్ కు ఖమ్మంలోని జాతి రత్నాలు ఫ్రెండ్స్ గ్రూప్ ఉదార స్వభావంతో అండగా నిలిచి రూ 65000 గురువారం ఆర్థిక సాయం చేశారు. ఎం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన నండ్ర ఉపేంద్ర, రామారావు దంపతుల కుమారుడు సాయి కార్తీక్ కు జాతి రత్నాలు మిత్ర బృందం సాయి కార్తీక్ ను ఖమ్మంలో ఘనంగా సత్కరించి పెద్ద మనసుతో ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించారు.
చదువుల్లో ఉన్నతంగా ఎదగడానికి సాయి కార్తీక్ కు తమ జాతి రత్నాలు మిత్ర బృందం తరపున ఎన్ ఐ టి లో ఇంజనీరింగ్ విద్య చదివే నాలుగు సంవత్సరాల పాటు తమ మిత్ర బృందం ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తామని మిత్ర బృందం తరఫున బిఆర్ఎస్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు చింత నిప్పు కృష్ణ చైతన్య తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జాతి రత్నాలు ఫ్రెండ్స్ గ్రూప్ సభ్యులు
ఎం. వెంకటాయపాలెం గ్రామ మాజీ సర్పంచ్ తుమ్మల సురేష్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు చింతనిప్పు కృష్ణచైతన్య, మందడపు సాయి వెంకట కృష్ణ,మద్ది కిషోర్ రెడ్డి,బోజెడ్ల దిలీప్, ప్రతపానేనీ సాయి వెంకట్,సామినేని చైతన్య,గుర్రం రాము,పునాటి.శ్రీను,నల్లమోతు రాకేష్, యెళ్లంకి కృష్ణ మోహన్, కొండపనేని రంజిత్ తదితర మిత్ర బృందం అందరూ కలిసి ఈ ఆర్థిక సహాయాన్ని సాయికార్తీక్ కు అందించడం జరిగింది.