కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ పరిధి నిజాంపేట్ 191 ఎన్టీఆర్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన లైఫ్ లైన్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ & రఫ మెడికల్ &జెనరల్ స్టోర్ ను ఈరోజు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ కె. పవన్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వ్యాపార కోణంలో కాకుండా సేవా దృక్పతంతో సేవలు అందించాలని సూచించారు. మెరుగైన వైద్య సేవలను అందించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఇంద్రాజిత్ రెడ్డి, నాయకులు రాములు, జీవన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, దశరథ్, హరి నారాయణ 7&5వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంజునాథ్, జశ్వంత్,191 ఎన్టీఆర్ నగర్ ప్రెసిడెంట్ కృష్ణ, యువ నాయకులు సాయి,ప్రనూతన్ రెడ్డి,మహేష్, సింహాద్రి, విక్రమ్ రెడ్డి, వినూతం రెడ్డి, రాజు,యజమానులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.