పిన్న వయసులోనే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టడమంటే ఇదే . మన దేశంలో అత్యున్నత స్థాయి పరీక్ష యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించే సివిల్స్ లో మొదటి ప్రయత్నంలోనే 40 వ ర్యాంక్ సాధించి IAS కు ఎంపికైన వరంగల్ కి చెందిన శ్రీ శాఖమూరి అమరలింగేశ్వర్( అమర్) పద్మజల కుమారుడు శ్రీ సాయి ఆశ్రిత్ ను శాలవతో సత్కరించి ,పుష్పగుచ్ఛం అందచేసి అభినందనలు తెలియచేసిన గౌరవ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ అతి పిన్న వయసులోనే మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ ఉద్యోగానికి ఎంపికై న సాయి ఆశ్రిత్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అని , 22 ఏండ్ల కే IAS సాధించడం చాలా గొప్ప విషయం అని , ఎంతో మంది కి కలల ఉద్యోగం అని దేశములోనే అత్యున్నత స్థాయి ఉద్యోగం అని , ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు అని , నేటి యువతకు స్ఫూర్తిదాయకం అని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు.
జీవితంలో గొప్పగా రాణించాలంటే ఉన్నత లక్ష్యాలను పెట్టుకొని అటువైపుగా అడుగులు వేయాలని, సడలని పట్టుదల, మంచి క్రమశిక్షణ, సాధించాలనే తపన , కఠోర శ్రమ తో అద్భుత ఫలితాలు సాధించవచ్చు అనడానికి శ్రీ సాయి ఆశ్రిత్ నిదర్శనం అని, భవిష్యత్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించలని, నిరుపేదలకు అండగా నిలిచి వారి అభ్యున్నతికి పాటు పడేలా విధినిర్వహణలో ముందుకు సాగాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచారు అని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు. ప్రజలకు మరింత సేవా చేసే గొప్ప అవకాశం లభించింది అని , విద్యార్థులు బాగా చదివి వారు ఎంచుకున్న రంగాలలో ఉన్నత స్థితి సాదించాలని, తల్లిదండ్రులకు, సమాజం కు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చి దేశం గర్వించేలా పాటుపడలని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.తల్లిదండ్రులు వారి పిల్లల అభిరుచికి తగ్గట్టు చదివించాలని, ఆదిశగా అడుగులు వేసి వారి బంగారు జీవితానికి బాటలు వేయాలని, వారి తల్లిదండ్రులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినదించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో శ్రీ సాయి ఆశ్రిత్ తండ్రి శ్రీ శాఖమూరి అమరలింగేశ్వర్( అమర్) పాల్గొన్నారు.