SAKSHITHA NEWS

నేలమీదేకాదు సముద్రపులోతుల్లో జీవిస్తున్న జీవరాసులకు మానవతప్పిదంవల్ల పర్యావరణ పరిరక్షణ సమతుల్యతలోపిస్తుంది.ఈ ప్రభావంతో మూగజీవాలు బలైపోతున్నాయి.ఇదే కోవలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం సముద్రతీరానికి భారీ తిమింగలం విగత జీవిగా ఒడ్డుకు కొట్టుకొచ్చింది.ఇటువంటి సంఘటన ఈ ప్రాంతంలో ఎన్నడుచూడలేదని ఈ భారీచేప ఇతర సముద్రప్రాంతాల్లో ప్రమాదానికి గురై మృత్యువాత పడి తీరానికి కొట్టుకొచ్చిందని స్థానికులు భావిస్తున్నారు.భారీచేప ఒడ్డుకు చేరడంతో ఈ ప్రాంత ప్రజలు చూసేందుకు తరలివొస్తున్నారు.ఇది కచ్చితంగా మానవ తప్పిదమేనని పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పర్యావరణ హితవర్లు అంటున్నారు.


SAKSHITHA NEWS