![ఖమ్మం స్థానిక సంస్థల అదనపు కలెక్టరుగా అభిలాష అభినవ్. 1 WhatsApp Image 2023 07 19 at 3.45.54 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-19-at-3.45.54-PM-300x300.jpeg)
![ఖమ్మం స్థానిక సంస్థల అదనపు కలెక్టరుగా అభిలాష అభినవ్. 2 WhatsApp Image 2023 07 19 at 3.45.54 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-19-at-3.45.54-PM-1024x900.jpeg)
సాక్షి త ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ఖమ్మం స్థానిక సంస్థల అదనపు కలెక్టరుగా అభిలాష అభినవ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు అదనపు కలెక్టర్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా పనిచేయుచున్న అభిలాష అభినవ్ ని ప్రభుత్వం ఇటీవల ఖమ్మం జిల్లాకు బదిలీ చేసింది. అదనపు కలెక్టర్ స్వస్థలం బీహార్ రాష్ట్రం పాట్నా కాగా, 2017 సివిల్ సర్వీస్ పరీక్షల్లో 18 ర్యాంక్ సాధించారు