SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 08 at 5.33.11 PM

నకిరేకల్ సాక్షితప్రతినిధి

అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసిన ఘనత వైయస్సార్ ది అని కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి దైద రవీందర్ అన్నారు. నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా దైద రవీందర్
కాంగ్రెస్ నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ ఫీజు రీయింబ‌ర్స్‌ మెంట్‌, ఆరోగ్యశ్రీ, 108, ఉచిత గృహాలు వంటి సంచలనాత్మక మైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి అన్ని సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి న్యాయం చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కే చెందుతుందని అన్నారు. ఆనాడు. కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన ఘనత వైయ‌స్ఆర్ కే దక్కుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ గార్లపాటి రవీందర్ రెడ్డి, కేతేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంపాసాటి శ్రీనివాస్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నామిరెడ్డి కృష్ణారెడ్డి, దోనాల సాయి రెడ్డి, ఏనుగు వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ దైద స్వప్న , మహిళా కాంగ్రెస్ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ దేవిక, మొహమ్మద్ సర్వర్ మియా, బీరవోలు ఉపేందర్ రెడ్డి, వంటెపాక నాగయ్య , యం.డి యూసుఫ్, టీపీసీసీ నకిరేకల్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ అబ్దుల్ మజీద్
యూత్ కాంగ్రెస్ నాయకులు నర్సింగ్ మహేష్ గౌడ్, వంటెపాక సతీష్, చెరుపల్లి సైదులు, దైద సురేష్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS