SAKSHITHA NEWS

ప్రజలందరూ కలిసి మెలిసి ఉత్సవాలు జరుపుకోవాలి – యస్.పి
సూర్యాపేట సాక్షిత

బక్రీద్ పండుగ పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు ముస్లిం సోదరులకు జిల్లా పోలీసు శాఖ తరపున యస్.పి రాజేంద్రప్రసాద్ ఐపిఎస్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగలు మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు. బక్రీద్ పండగ వేల పోలీసు బందోబస్తు కు సంబంధించి జిల్లా పోలీస్ కార్యాలయం నందు డీఎస్పీలు, సిఐ లతో సమావేశం నిర్వహించారు. బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేయాలని ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షణ, నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ కూడా సామరస్యంగా కలిసిమెలిసి ఉత్సవాలు జరుపుకోవాలని యస్.పి కోరారు. ఇతరుల మనోభావాలు, భావోద్వేగాలను కించపరిచే విధంగా ఆకతాయి పనులకు పాల్పడితే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యస్.పి హెచ్చరించారు. సిబ్బంది అందరూ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు, సిఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

యస్.పి కి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం..

జిల్లా పోలీస్ శాఖ సమర్థవంతంగా ముందుకు నడుపుతూ రాష్ట్రంలో పోలీస్ శాఖకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చేలా చర్యలు తీసుకొని నిధులు నిర్వర్తించేలా ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకెళ్తూ జిల్లాకు గౌరవం దగ్గర చేసిన జిల్లా యస్.పి రాజేంద్రప్రసాద్ ఐపీఎస్ కి పోలీసు సంక్షేమ సంఘం వారు యస్.పి నీ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ సంక్షేమ సంఘం అధ్యక్షులు రామచంద్ర గౌడ్ మాట్లాడుతూ సిబ్బంది సంక్షేమం కోసం పాటుపడుతు, జిల్లా యస్.పి తనదైన శైలిలో జిల్లా పోలీస్ శాఖను నడిపిస్తూ రాష్ట్రంలో జిల్లా కు మంచి పేరుప్రతిష్టలను వచ్చేలా ప్రణాళికతో పని చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో
ఏఓ సురేష్ బాబు, ఇంటలిజెన్స్ ఏ ఎస్ఐ గాలి శ్రీనివాస్, చివ్వెంల ఏ ఎస్ఐ గునగంటి వెంకన్న గౌడ్, డిసిఆర్బి ఏ ఎస్ఐ అంజన్ రెడ్డి, బరోసా సెంటర్ ఏ ఎస్ఐ సైదాబి, సంఘం సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS