SAKSHITHA NEWS

చిట్యాల సాక్షిత ప్రతినిధి

బడిబాట, పాఠనోత్సవం కార్యక్రమంలో భాగంగా చిట్యాల పట్టణంలోని ప్రాధమిక పాఠశాలలు, భవిత కేంద్రాన్ని జిల్లా విద్యారంగ పర్యవేక్షణ అధికారి (సెక్టోరియల్ అధికారి -1) ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రాధమిక పాఠశాల విద్యార్థులను పఠనం చేయిస్తూ వారికి ఏలాంటి డౌట్ వచ్చిన వెంటనే ఉపాద్యాయులను అడిగి నేర్చుకోవాలి ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలి అని తెలియ జేశారు. పాఠశాల లో నిర్వహిస్తున్న పాఠనోత్సవ కార్యక్రమాన్ని ,బడిబాట ఎఫ్ ఎల్ ఎన్ నిర్వహణ తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. అలాగే భవిత కేంద్రం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ మీ యొక్క పిల్లలను నిత్యం కేంద్రానికి తీసుకొస్తే ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది అని తెలియజేసారు.ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు స్లీవమ్మ, ఉపాద్యాయులు బాదం భిక్షపతి, విజయ లక్ష్మి, వనజ ,భవిత ఉపాద్యాయులు బోయ శ్రీనివాసులు, ఆవుల గీత, సిఆర్పి జయకాంత్ లు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS