అనిచివేతకి గురైన తెలంగాణ నేడు గణనీయమైన అభివృద్ధి చెందింది – ఎమ్మెల్యే భగత్
హాలియ సాక్షిత ప్రతినిధి
హాలియా లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధనకై ప్రాణ త్యాగం చేసి అమరులైన ముకుందాపురం గ్రామానికి చెందిన పిల్లి గిరిబాబు యాదవ్ మరియు చలకుర్తి గ్రామానికి చెందిన మైనంపల్లి శ్రీనివాస్ రెడ్డి తల్లిదండ్రులతో కలిసి ఎమ్మెల్యే నోముల భగత్ క్యాంప్ కార్యాలయంలో అల్పాహారం చేశారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరుల తల్లిదండ్రులతో పాటు తెలంగాణ ఉద్యమకారులతో కలిసి నివాళులర్పించి, అమరవీరుల తల్లిదండ్రులకు శాలువాతో ఘనంగా సత్కరించి నూతన వస్త్రాలను బహూకరించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అణచివేతకు గురైన తెలంగాణను అమరుల త్యాగఫలం తో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ సబ్బండ వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న సీఎం కేసీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న నాయకులు, అధికారులు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.