సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల భాగంగా హరితోత్సవం దినం సందర్భంగా దుందిగల్ మునిసిపల్ లోని హరితవనం అవరణలో మొక్కలు నాటిన దుందిగల్ పురపాలక చైర్-పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ .. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున్న జరిగిన కృషిని వివరించారు. అడవుల పునరుద్ధరణ కోసం తీసుకున్న చర్యలు, వాటి వలన వచ్చిన ఫలితాలను తెలిపారు.
అనంతరం టేక్-మహీంద్రా యూనివర్సిటీ నుండి బహదూర్ పల్లి వెళ్ళే మార్గంను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ పద్మా రావు, కమిషనర్ సత్యనారాయణ, కౌన్సిలర్లు శంభీపూర్ క్రిష్ణ, జక్కుల క్రిష్ణ యాదవ్, మహేందర్ యాదవ్, సాయి యాదవ్, భారత్ కుమార్, అమరం గోపాల్ రెడ్డి, పాక్స్ డైరెక్టర్ అర్కల జీతయ్య, సీనియర్ నాయకులు నాయకులు బుచ్చిరెడ్డి, సగ్గిడి శ్రీనివాస్, మునిసిపల్ యూత్ అద్యక్షులు మైసిగారి శ్రీకాంత్, అర్.వో.శ్రీహరి రాజు, మేనేజర్ సునంద, ఏఈ ప్రవీణ్ కుమార్, మునిసిపల్ సిబ్బంది, హారితవనం సిబ్బంది, ఆటవి సిబ్బంది, యం.ఎల్.అర్.ఐ.టి విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు…