SAKSHITHA NEWS

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు హైదరాబాద్‌ నగరంలో పరిపాలనను మరింతగా పౌరులకు చేరువ చేయాలన్న లక్ష్యంగా, ప్రజా సమస్యల పరిష్కారానికై, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణ ప్రగతి దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు పాలన అనే ఉద్దేశ్యంతో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంశిగుడా లో నూతనంగా ఏర్పాటు చేసిన వార్డ్ కార్యాలయం ను AMOH శ్రీమతి మమత మరియు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ వార్డ్ కార్యాలయాలు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఒక చక్కటి వేదిక అని ,ప్రజల చెంతకు పాలన అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.ఈ చక్కటి సదవకాశం ను ప్రతి ఒక్కరు , కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు ,ప్రజలు తప్పకుండా సద్వినియోగం చేసుకొవలని ప్రజా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.
హైదరాబాద్ మహా,నగరంలో పెరుగుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా, ప్రజల ప్రమేయంతో పాటు వారి భాగస్వామ్యాన్ని సుస్థిరం చేయడానికి పౌరుల సౌకర్యార్థం ప్రస్తుత వ్యవస్థ కు అవసరమైన విధంగా వికేంద్రీకరణ చేసి పునర్నిర్మాణంతో నాల్గవ పరిపాలనా వ్యవస్థ (యూనిట్)గా వార్డుస్థాయి కార్యాలయాలను ఏర్పాటు చేయాలని హైదరాబాద్ మహానగర పాలక సంస్థ నిర్ణయించింది.

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ వ్యాప్తంగా ఉన్న మొత్తం 150 వార్డులలో వార్డు కార్యాలయాలంలో 10 మంది సిబ్బందితో ఏర్పాటు చేయడం జరిగినది అని, ఈ కార్యాలయామునకు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారిని వార్డు ఆఫీసర్గా నిర్ణయించనైనది. ఈ అధికారి పర్యవేక్షణలో పారిశుద్ధ్యం, రోడ్ మెయింటెనెన్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, ఎంటమాలజీ, యుబిడి, యుసిడి, జలమండలి, ట్రాన్స్ కో (విద్యుత్) మరియు ఇతర విభాగాల నుండి తీసుకోబడిన ఉద్యోగులను ప్రతి వార్డు కార్యాలయంలో ఫిర్యాదులను స్వీకరించడానికి, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు నియమించబడింది. ఈ అధికారులు వార్డు స్థాయిలో సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాల అమలను కూడా పర్యవేక్షిస్తారు అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.

ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు!

ప్రభుత్వ పాలనా వ్యవస్థ గ్రామ స్థాయిలో పటిష్టంగా ఉంటే రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని, అద్భుతమైన అభివృద్ధి దిశగా రాష్ట్రం పయనిస్తుందన్న ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం, పరిపాలనా దక్షతకు తార్కాణం.

జిల్లాల విభజనతో పాలనా వ్యవస్థ ప్రజలకు చేరువైంది. జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల నిర్మాణంతో వివిధ ప్రభుత్వ విభాగాలన్నిటిని ఒకే ఆవరణలోకి తీసుకురావడంతో ప్రజల సమయం వృధా కాకుండా సత్వరం వారి సమస్యల పరిష్కారమౌతున్నాయి.

గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ శాఖల ప్రక్షాళన, సంస్కరణల అమలుతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేస్తూ, ప్రగతి పథంలో శరవేగంగా దూసుకుపోతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.వార్డు కార్యాలయం ద్వారా నగర ప్రజలకు మరింత వేగంగా పౌర సేవలు అందుతాయి. పౌర సేవలతో పాటు ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జిహెచ్ఎంసి అధికార యంత్రాంగానికి వీలు కలుగుతుంది. దేశంలోనే మొదటిసారిగా ఇలాంటి వ్యవస్థను మన నగరంలో ఏర్పాటు చేయడం గొప్ప విషయం అని, రోడ్డు నిర్వహణ, పారిశుధ్యము, ఎంటమాలజీ, హరితహారం, టౌన్ ప్లానింగ్, విద్యుత్ శాఖ, జలమండలి, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఇలా పదిమంది అధికారులు వార్డు స్థాయిలో జరిగే ఆయా శాఖల కార్యక్రమాలను పర్యవేక్షిస్తారూ. కేవలం అధికారులను నియమించడమే కాకుండా, వారి విధుల నిర్వహణకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను చేస్తాం, పౌరుల సమస్యల పరిష్కారానికి నిర్ణీతమైన గడుపుతో కూడిన సిటిజన్ చార్టర్ కూడా జిహెచ్ఎంసి ఈ వార్డు కార్యాలయం ద్వారా పౌరులకు అందిస్తుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.


SAKSHITHA NEWS