SAKSHITHA NEWS

నేటి బాలలే రేపటి పౌరులు
ర్యాలీలో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్

నేటి బాలలే రేపటి పౌరులని, అటువంటి బాలలను కార్మికులుగా వినియోగిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ యాజమాన్యాలను హెచ్చరించారు.ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్బంగా స్థానిక ఎన్.జి.ఓ హోమ్ వద్ద ర్యాలీ కార్యక్రమం కార్మిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరై జెండా ఊపి ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు.శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలి వరకు సాగిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని నేడు నిర్వహించుకుంటున్నామని,ఈ ర్యాలీ ఒక అవగాహన కార్యక్రమమని పేర్కొన్నారు.చట్టానికి వ్యతిరేకంగా బాలలని పనిలో చేర్పించుకున్నవారు న్యాయపరంగా శిక్షకు అర్హులని, కావున షాపులు, చిన్నతరహా పరిశ్రమలు, వివిధ సంస్థల యజమానులు బాల కార్మికులతో పనులు చేయించుకోరాదని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలు అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థినీ, విద్యార్థులు,పెద్ద సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS