SAKSHITHA NEWS

*సాక్షిత : *భారతి నగర్ డివిజన్ పరిధిలోని బీహెచ్ఈఎల్ లో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఎమ్మెల్యే సీడీపీ నిధులనుండి 10 లక్షల రూపాయల అంచనా వ్యయం తో మోక్షధామం లో షెడ్ నిర్మాణం మరియు గోశాల నిర్మించుకున్న శుభ సందర్భంగా బీఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిల బ్రాహ్మణ కమ్యూనిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించడం జరిగినది.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తానని, ఎమ్మెల్యే సీడీపీ నిధుల నుండి 10 లక్షల రూపాయలతో షేడ్ మరియు గోశాల నిర్మాణం కోసం కృషి చేయడం జరిగినది అని, సద్వినియోగం చేసుకోవాలని, తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని ,అన్ని విధాలుగా అండగా నిలుస్తానని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. ఇందులో సమావేశాలు నిర్వహించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. హిందూ ధర్మాన్ని పాటిస్తూ అన్ని మతాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని. రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ను ఏర్పాటు చేసి నిధులు కేటాయించారని పేర్కొన్నారు. అదేవిధంగా కరోనా విపత్కర సమయంలోను నియోజకవర్గంలోని పేద బ్రాహ్మణులందరికీ నిత్యవసర సరుకులు అందించామని తెలిపారు. బ్రాహ్మణుల సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని ,ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

అఖిల బ్రాహ్మణ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఏ బీ సీ డీ అసోసియేషన్ సభ్యులు   మాట్లాడుతూ మేము అడిగిన వెంటనే మోక్షాధామం షేడ్ నిర్మాణం కోసం నిధులు కేటాయించి, నిర్మాణానికి సహాకరించిన, ఈ షేడ్ నిర్మాణం వలన మాకు ఎంతో సహాయకరంగా ఉంది అని దీనికి సహకరించిన ఎమ్మెల్యే గాంధీ కి  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని ,అదేవిధంగా ఎమ్మెల్యే గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని  కొనియాడారు .

ఈ కార్యక్రమంలో అఖిల బ్రాహ్మణ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఏ బీ సీ డీ బిహెచ్ఇఎల్ శాఖ అధ్యక్షుడు ఏంవీ శాస్త్రి, కార్యదర్శి జి వి ఎస్ మూర్తి, సభ్యులు నాగరాజారావు ప్రసాద్, ఆకెళ్ళ కృష్ణమూర్తి, శేరిలింగంపల్లి శాఖ అధ్యక్షుడు కుమార్ తదితరులు పాల్గొన్నారు

WhatsApp Image 2023 06 05 at 5.16.32 PM

SAKSHITHA NEWS