SAKSHITHA NEWS

నిందితుడి ఫోటో విడుదల చేసిన పోలీసులు.

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో శుక్రవారం సంగీత ఫ్యాషన్స్ లో వినియోగదారుడు రూపంలో వచ్చిన సైబర్ నేరగాడు బట్టలు కొనుగోలు చేసిన తర్వాత ఫోన్పే ద్వారా ఒక రూపాయి పంపిస్తే అదే నంబర్ కు తిరిగి నగదు చెల్లిస్తానని దుకాణ యజమానిని నమ్మబలికి తర్వాత దుకాణ యజమాని అకౌంట్ నుంచి 87 వేల రూపాయలను కాజేశాడు. తర్వాత అక్కడి నుంచి ఆ సైబర్ నెరగాడు జారుకున్నాడు.

ఈ విషయాన్ని గ్రహించిన దుకాణ యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సిసి పుటేజులు పరిశీలించి నిందితుడి ఫోటోను విడుదల చేశారు. ఎవరైనా ఈ ఫోటోలో పల్సర్ బండి పై వెళ్తున్న వ్యక్తిని గుర్తిస్తే తక్షణమే 9121102188 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని గిద్దలూరు ఎస్సై బ్రహ్మనాయుడు విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని ఎస్సై బ్రహ్మనాయుడు సూచించారు.


SAKSHITHA NEWS