SAKSHITHA NEWS

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, ప్రెస్ నోట్, తేది:25-05-2023.

👉 ది 26-05-2023 తేదీన గుంటూరు జిల్లా, తుళ్ళూరు మండలం వెంకట పాలెం, శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయం ప్రక్కన * ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టా పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్బంగా ఆ కార్యక్రమంనకు సంబంధించి ట్రాఫిక్‌ను సక్రమంగా క్రమబద్ధీకరించడానికి వీలుగా చేసిన మార్పులు గురించి సాధారణ ప్రజల సమాచారం కోసం దీని ద్వారా తెలియజేస్తున్నాము.

★ 26-05-2023 తెల్లవారుజామున 04:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు కింది ట్రాఫిక్ మళ్లింపులు మరియు భారీ వాహనాల హోల్డింగ్ పాయింట్ల వివరాలు:-

👉 భారీ వాహనములు మరియు లారీల మళ్లింపులు:-

★ అన్ని భారీ వాహనములు మరియు లారీలను 26-05-2023 తెల్ల వారు జామున 04:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు తుళ్ళూరు మండలం, వెంకట పాలెం, శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టా పంపిణీ కార్యక్రమం జరుగుతున్న సమయంలో జాతీయ రహదారిపైకి రాకుండా క్రింద సూచించిన విధంగా దారి మళ్ళించడం జరుగుతుంది.

1.) చెన్నై వైపు నుండి విజయవాడ మీదుగా విశాఖపట్నం వైపు మరియు ఇబ్రహీంపట్నం, నందిగామ వైపుకు వెళ్ళు భారీ గూడ్స్ వాహనములు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ సమీపంలోనీ త్రోవగుంట వద్ద నుండి చీరాల- బాపట్ల – రేపల్లె- అవనిగడ్డ- పామర్రు – గుడివాడ – హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం మరియు ఇబ్రహీంపట్నం వైపుకు మళ్ళించడం జరుగుతుంది.

2.) చెన్నై నుండి హైదరాబాద్ వైపు వెళ్ళే వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ళు,నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్ పల్లి మీదుగా హైదరాబాద్ వెళ్ళవలెను.

3.) చిలకలూరిపేట నుండి విశాఖపట్నం వైపు వెళ్ళే వాహనాలను చిలకలూరు పేట నుండి NH-16 మీద పెదనందిపాడు ,కాకుమాను, పొన్నూరు , చందోలు, చెరుకుపల్లి , భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు – గుడివాడ – హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించబడును.

4.) చెన్నై నుండి విశాఖపట్నం వెళ్ళే వాహనాలను బోయపాలెం క్రాస్ వద్ద నుండి ఉన్నం గ్రామం, ఏ.బి.పాలెం వల్లూరు, పాండ్రపాడు, పొన్నూరు ,చందోలు,చెరుకుపల్లి , భట్టిప్రోలు , పెనుమూడి బ్రిడ్జ్ మీదగా అవనిగడ్డ, పామర్రు – గుడివాడ – హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించబడును.

5.) గుంటూరు నుండి విశాఖపట్నం వెళ్ళే వాహనాలను బుడంపాడు మీదుగా తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్ ,పెనుమూడి బ్రిడ్జ్ మీదగా అవనిగడ్డ, పామర్రు – గుడివాడ – హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించబడును.

6.) విశాఖపట్నం వైపు నుండి చెన్నై వైపు వెళ్ళు లారీలు,భారీ వాహనములు హనుమాన్ జంక్షన్ వద్ద నుండి గుడివాడ – పామర్రు – అవనిగడ్డ – రేపల్లె- బాపట్ల – చీరాల – త్రోవగుంట ౼ ఒంగోలు మీదుగా మళ్ళించడం జరుగు తుంది.

7). రాజమండ్రి నుండి హైదరాబాద్ వైపు వెళ్ళు వాహనములు , దివాన్ చెరువు, ధవళేశ్వరం బ్రిడ్జి, కొవ్వూరు , జంగారెడ్డి గూడెం , అస్వరావు పేట , సత్తుపల్లి మీదుగా మళ్ళించడం జరుగుతుంది.

8). విశాఖపట్నం నుండి హైదరాబాద్ వైపు వెళ్ళు లారీలు, భారీవాహనములు హనుమాన్ జంక్షన్ వద్ద నుండి నూజివీడు- మైలవరం – జి కొండూరు, ఇబ్రహీంపట్నం వైపు మళ్ళించడం జరుగుతుంది.

9). గన్నవరం వైపు నుండి హైదరాబాద్ వెళ్ళు వాహనములు కేసరపల్లి , ముస్తాబాద్,ఇన్నర్ రింగ్ రోడ్ , పైపుల రోడ్, ఇబ్రహింపట్నం వైపుకు మళ్ళించడం జరుగుతుంది.

10.) హనుమాన్ జంక్షన్ వైపు నుండి హైదరాబాద్ వెళ్ళు వాహనములు గన్నవరం గాంధి బొమ్మ,ఆగిరి పల్లి, జి కొండూరు, ఇబ్రహీంపట్నం వైపు మళ్ళించడం జరుగుతుంది.

11.) భారీ సరుకు రవాణా వాహనములను-గన్నవరం, ఆగిరి పల్లి, జి కొండూరు,ఇబ్రహీంపట్నం వైపు మళ్ళించడం జరుగుతుంది.

12). హైదరాబాద్ వైపు నుండి చెన్నై వైపు వెళ్ళే వాహనాలు నార్కెట్ పల్లి , నల్గొండ,మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ళు, అద్దంకి, మేదరమెట్ల మీదుగా చెన్నై వెళ్ళవలెను.

13). హైదరాబాద్ వైపు నుండి విశాఖపట్నం వెళ్ళు లారీలు, భారీవాహనములు ఇబ్రహీంపట్నం వద్ద నుండి జి -కొండూరు – మైలవరం- నూజివీడు -హనుమాన్ జంక్షన్ వద్ద నుండి అనుమతిస్తారు.

14). చెన్నై వైపు నుండి విశాఖపట్నం వైపు వెళ్ళే multi-axel Goods వాహనాలను ఎటువంటి మళ్లింపు లేకుండా జాతీయ రహదారి కి సమీపంలోని చిలకలూరిపేట, ఒంగోలు మరియు నెల్లూరు వద్ద నిలిపివేయబడును. ఆ వాహనాలను సాయంత్రం 4 గంటల అనంతరం వాహనాలను అనుమతిస్తారు.

15.) విశాఖపట్నం వైపు నుండి చెన్నై వైపు వెళ్ళే multi-axel Goods వాహనాలను హనుమాన్ జంక్షన్ వద్ద మరియు పొట్టిపాటు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారికి సమీపంలో నిలిపివేయబడును. ఆ వాహనాలను సాయంత్రం 4 గంటల అనంతరం వాహనాలను అనుమతిస్తారు.

👉 పెదకాకాని వైపు నుండి తుళ్ళూరు మండలం వెంకట పాలెం వచ్చే వారి వాహనాల పార్కింగ్ ప్రదేశం వివరాలు :-

1.) తక్కెళ్ళపాడు, ఉప్పలపాడు, నంబూరు, అగాతార పాడు, తక్కేళ్ళ పాడు వైపు నుంచి వచ్చే వాహనాలు కుప్పరావురు నుంచి కంతేరు తాడికొండ పెద్దపరిమి తుళ్లూరు రాయపూడి సిడి యాక్సెస్ రోడ్డు రావాలి.

2.) మంగళగిరి టౌన్, ఖాజా, ఆత్మ కూరు, పెద్దవడ్లమూడి, వైపు నుండి వచ్చే వాహనాలు నిడమర్రు,కురకల్లు, VIT కాలేజీ జంక్షన్, అసెంబ్లీ వెనుక నుండి,వెలగపూడి చర్చ్ సెంటర్ మీదుగా సీడ్ యాక్సిస్ కి రావాలి.

  1. తాడేపల్లి నుంచి వచ్చే వాహనాలు ఎయిమ్స్ ఆస్పత్రి లోపల నుంచి మంగళగిరి బ్రిడ్జి డాన్ బాస్కో స్కూలు ఎర్రబాలెం కిష్రాయపాలెం, మందడం, మీదుగా వెలగపూడి చర్చ్ దగ్గర కుడివైపుకు తీసుకొని సీడ్ యాక్సెస్ N9 జంక్షన్కు వచ్చి సీడ్ యాక్సెస్ రోడ్డు కి రావాలి
  2. విజయవాడ వైపు నుంచి వాహనాలు ఉండవల్లి, ఉండవల్లి కేవ్స్, పెనుమాక మీదుగా కృష్ణాయ పాలెం, దాటాక కుడి వైపు మెటల్ రోడ్ లోకి తీసుకొని, వెంకటపాలెం పార్కింగ్ ప్లేస్ రావాలి.
  3. విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలు విజయవాడ ఎయిమ్స్ పక్కగా బ్రహ్మానందపురం రైల్వే గేటు నులకపేట మీదుగా ఉండవల్లి సెంటర్ , ఉండవల్లి గృహాలు , పెనుమాక కృష్ణయ్య పాలెం దాటాక కుడివైపుకు తీసుకొని వెంకటపాలెం పార్కింగ్ కి రావలెను

★మీడియా వారికి విజ్ఞప్తి: ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మరియు FM స్టేషన్ ల యొక్క ఎడిటర్‌లు మరియు డైరెక్టర్‌లందరికీ ప్రజల భద్రత దృష్ట్యా విస్తృత ప్రచారం/టెలికాస్ట్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాము.


SAKSHITHA NEWS