సివిల్స్ లో 694వ ర్యాంక్ సాధించిన రంగన్నగూడెం నివాసి పుసులూరు రవికిరణ్అభినందనలు తెలిపిన రంగన్నగూడెం గ్రామ ప్రజాప్రతినిధులు

SAKSHITHA NEWS

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామానికి చెందిన యువ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పుసులూరు రవికిరణ్ యూ.పి.పి.ఎస్.సి విడుదల చేసిన సివిల్ ఫలితాలలో అఖిల భారత స్థాయిలో 694వ ర్యాంకు సాధించారు. ఈ ర్యాంకు సాధించడం పట్ల రంగన్నగూడెం గ్రామ ప్రముఖులు,సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగామణి, ఎంపీటీసీ సభ్యులు పుసులూరు లక్ష్మీనారాయణ, ఎంపీసీఎస్ అధ్యక్షులు మొవ్వ శ్రీనివాసరావు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు తుమ్మల దశరధ రామయ్య తదితరులు అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు రంగన్నగూడెంలో మాట్లాడుతూ ప్రాథమిక దశ నుంచి మెరిట్ విద్యార్థి అయిన పుసులూరు రవికిరణ్ 2019లో మెరుగైన ర్యాంకు సాధించి ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ (ఐ.సి.ఎల్.ఎస్) కు ఎంపికై ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ప్రస్తుతం ఢిల్లీలో అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ గా పనిచేస్తున్నారని మంచి ఉద్యోగం వచ్చినాకూడా ఐ.ఏ.ఎస్, ఐ.ఆర్.ఎస్ కావాలనే తన లక్ష్యానికి అనుగుణంగా ఆ తర్వాత సంవత్సరాలలో కూడా సివిల్స్ రాస్తూ తాజా ఫలితాల్లో 694వ ర్యాంకు సాధించడం కృష్ణా జిల్లాకే గర్వకారణం అన్నారు. మొదటినుంచి రవి కిరణ్ కు రంగన్నగూడెం రూరల్ డెవలప్మెంట్ సొసైటీ(అర్.అర్. డీ. ఏస్) నుంచి సలహాలు,సూచనలు ఇచ్చి ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నామని, యువకులకు ఐఏఎస్ శిక్షణ కొరకు గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2014లో ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ విద్యాదీవేన పథకానికి ఎంపికై ఢిల్లీలో రవికిరణ్ శిక్షణ పొందారని, రవికిరణ్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానం సాధించి రంగన్నగూడెం గ్రామానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

ap జగనన్న మెగా లేఅవుట్పై విచారణ: చంద్రబాబు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSAP: YSR జిల్లా పులివెందులలోని జగనన్న మెగా లేఅవుట్పై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. ఇక్కడ 8,400 ఇళ్లను మంజూరు చేసి అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారని MLC రాంగోపాల్ రెడ్డి సీఎంకు ఫిర్యాదు చేశారు. మూడేళ్ల క్రితం స్థలాలు…

SAKSHITHA NEWS

bapatla బాపట్ల పట్టణంలోని భావపురి కాలనీ వాస్తవ్యులు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSbapatla బాపట్ల పట్టణంలోని భావపురి కాలనీ వాస్తవ్యులు, ఇండియన్ ఆర్మీ ఉద్యోగి షేక్ రజ్జు భాషా (42) విధి నిర్వహణలో జమ్ముకాశ్మీర్ లో గుండె పోటుతో మృతి చెందగా షేక్ రజ్జు భాషా పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన…

SAKSHITHA NEWS

You Missed

collector జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్

collector జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్

sitakka బస్తీ దావకాన సిబ్బందితో రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకున్న మంత్రి సీతక్క

sitakka బస్తీ దావకాన సిబ్బందితో రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకున్న మంత్రి సీతక్క

ap జగనన్న మెగా లేఅవుట్పై విచారణ: చంద్రబాబు

ap జగనన్న మెగా లేఅవుట్పై విచారణ: చంద్రబాబు

bapatla బాపట్ల పట్టణంలోని భావపురి కాలనీ వాస్తవ్యులు

bapatla బాపట్ల పట్టణంలోని భావపురి కాలనీ వాస్తవ్యులు

ganja పెందుర్తి పినగాడి వద్ద 20 కేజీలు గంజాయిని పట్టుకున్న పెందుర్తి పోలీసులు

ganja పెందుర్తి పినగాడి వద్ద 20 కేజీలు గంజాయిని పట్టుకున్న పెందుర్తి పోలీసులు

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

You cannot copy content of this page