SAKSHITHA NEWS

పేదింటి ఆడబిడ్డలకి కొండంత అండగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ – ఎమ్మెల్యే చిరుమర్తి

— కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

చిట్యాల సాక్షిత ప్రతినిధి

పేదింటి ఆడబిడ్డలకి కొండంత అండగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఉన్నాయ ని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల పట్టణంలోని బి.ఎన్ రెడ్డి గార్డెన్స్ లో చిట్యాల మండలం లోని వివిధ గ్రామాలకు చెందిన 63 మంది లబ్దిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మి చెక్కులను అలాగే 34 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ.10 లక్షల విలువైన చెక్కులను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పధకం యావత్ ప్రపంచంలోని ఏ దేశంలో ఏ రాష్ర్టంలో కూడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు రెక్కాడితేగాని డొక్కాడని పేదలు తమ ఆడబిడ్డల పెళ్లి కోసం అప్పులు చేసి ఆ అప్పులకు మిత్తిలు కట్టి అనేక ఇబ్బందులు పడేవారన్నారు కల్యాణ లక్ష్మి షాదిముబారక్ పధకం ద్వారా సీఎం కెసిఆర్ పేదల ఇంటి మేనమామగా మారి ఆడబిడ్డ పెళ్ళికి 1,00,116 రూ.లని కానుక అందిస్తున్నారని పేర్కొన్నారు.
పేదల శ్రేయస్సు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తుందనన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్, తహసిల్దార్ జక్కర్తి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆది మల్లయ్య, నాయాబ్ తాసిల్దార్ రాగ్యా నాయక్,
మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, రెవిన్యూ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు, కౌన్సిలర్ కోనేటి కృష్ణ, సర్పంచులు మర్రి జలంధర్ రెడ్డి, బోయపల్లి వాణి శ్రీనివాస్, కక్కిరేణి బొందయ్య, వీసం బాబు, ఆరూరి లాలమ్మ స్వామి, ఉయ్యాల సత్తయ్య, వెలిమినేడు పిఎసిఎస్ చైర్మన్ బిక్షపతి, చిట్యాల
సింగిల్ విండో డైరెక్టర్ జగిని బిక్షం రెడ్డి, బిఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఆవుల ఐలయ్య, కార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ యాకారి నరేందర్, యువజన విభాగం అధ్యక్షుడు తుమ్మల నాగరాజు రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య కార్యదర్శి జిట్టా చంద్రకాంత్, నాయకులు కర్నాటి ఉప్పల్ రెడ్డి, దాసరి నర్సింహ, సిలివేరు శేఖర్, మర్ల రామ్ రెడ్డి ఏళ్ల సత్య నారాయణరెడ్డి, మేడి నర్సింహ, చాపల సతీష్, జయారపు శివప్రసాద్ వివిధ హోదాలలో ఉన్న నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS