SAKSHITHA NEWS

సాక్షిత : తెనాలి పోలీసు డివిజన్లోని
ప్రథాన సమస్యలపై దృష్టి సారించి పరిష్కరిస్తాననితెనాలి DSPగా బాథ్యతలు చేపట్టిన బి. జనార్థన రావు అన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను 1995 బ్యాచ్ చెందిన వాడినని తొలుత పోష్టింగ్ ఏలూరని పిదప దీర్ఘ కాలం CID , ACB శాఖలలో కృష్ణ జిల్లాలో పని చేశానని విజయవాడ పశ్చిమ అవినీతి నిరోథక శాఖ ACP గా అర్భన్ లో పని చేస్తు అదే కేడర్లో తెనాలి DSP వచ్చానన్నారు._


తాను డివిజనంతా ఓసారి పరిశీలించి అవగాహనతో సమస్యలు పరిష్కరిస్తానని ముఖ్యంగా తెనాలి ట్రాఫిక్ సమస్య దీర్ఘకాలంనుంచి ఉందని దాన్ని పరిష్కరించే దిశగా చర్యలు చేపడతానన్నారు.
ఈ సందర్భంగా ఉదయం నుండి DSP కార్యాలయంలో డివిజన్ పరిథిలోని పోలీసు అథికారులు, కార్యాలయ సిబ్బంది నూతన DSPని ఘనంగా స్వాగతం పలికారు…

WhatsApp Image 2023 05 10 at 5.49.58 PM

SAKSHITHA NEWS