ఉద్యోగ విరమణ పొందిన మహిళ హోంగార్డు కు సన్మానం
సాక్షీత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ఉద్యోగ విరమణ పొందిన మహిళ హోంగార్డు మేరి గ్రేస్ ను పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ..సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో భాద్యతయుతమైన విధులు నిర్వహించి పోలీస్ శాఖ కు ఎనలేని సేవలతో పోలీస్ అధికారుల మన్ననలు పొందారని పోలీస్ కమీషనర్ కొనియాడారు. రిటైర్ మెంట్ తన వృత్తికే, కాని తన వ్యక్తిత్వానికి కాదని, మీ విధినిర్వహణలో తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. పదవీవిరమణ చేసిన మీరు పోలీస్ కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చిన సంప్రదించవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో హోంగార్డ్ ఆర్ ఐ ఎస్ శ్రీశైలం ఖమ్మం జిల్లా హోంగార్డ్ ఆఫీసర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మహమ్మద్ రఫీ ఉపాధ్యక్షుడు బంక శీను, హోంగార్డ్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ వెంకటేశ్వర్లు,రహీం, రవి, దివ్య తదితర హోంగార్డ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.