సాక్షిత రామగుండం : తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ అని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పెద్దపెల్లి జిల్లా రామగుండంలో నూతనంగా నిర్మించిన పోలీస్ కమిషనరేట్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులకు 2014 అనంతరం అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. నేరాలను చేధించడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నారన్నారు. ఆంధ్ర పాలకులు తెలంగాణ వస్తే పాలన చేత కాదని భద్రత ఉండదని, ఎన్నో అసత్యపు ప్రచారాలు చేశారని, తెలంగాణ దేశంలోనే శాంతిభద్రత విషయంలో మొదటి స్థానంలో ఉండడం గర్వించదగ్గ విషయమన్నారు.
150 సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా కమిషనరేట్ భవనం నిర్మించామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్ప శుద్ధితో నిర్మించారన్నారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్, రాజీవ్ రతన్, మల్టీ జోన్ 1 ఐజి చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, శాసన మండలి చీఫ్ విప్ భానుప్రసాదరావు, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, దివాకర్ రావు, చిన్నయ్య లతోపాటు పలువురు పాల్గొన్నారు.