సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ కు చెందిన ఉద్యమకారుడు టీఆర్ఎస్ జగన్ కు జీవనోపాధి కొరకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తన స్వంత నిధులతో ఆటోను అందించి అండగా నిలిచారు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న జగన్ సుభాష్ నగర్ ను వీడి సొంత ఊరికి వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అతనికి భరోసానిచ్చారు. దీంతో జగన్ ఎమ్మెల్యే ని తన నివాసం వద్ద కలిసి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవడం తన బాధ్యత అని అన్నారు. జగన్ కు అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, నాయకులు అడప శేషు, పద్మజ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
Related Posts
తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను సీఎం అడిగి తెలుసుకు న్నారు.…
నల్లగొండ కలెక్టర్ లోని ఉదయాదిత్య భవన్ లో జిల్లా అభివృద్ధి
SAKSHITHA NEWS నల్లగొండ కలెక్టర్ లోని ఉదయాదిత్య భవన్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన (దిశ) సమావేశంలో ఇంచార్జీ జిల్లా మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , రాష్ట్ర రోడ్లు…