SAKSHITHA NEWS

సాక్షిత :హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నాగార్జున హామ్స్ లో రూ.12 లక్షల అంచనా వ్యయంతో చిల్డ్రన్స్ పార్కులో ఏర్పాటు చేసే ఆట పరికరాల గురించి కాలనీ వాసులతో కలిసి చర్చించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .
ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ పిల్లలు చిన్నతనంలో ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉంటేనే చిన్నారుల్లో మానసిక, శారీరక ఉత్సాహం, ఎదిగే కొద్ది వినూత్న ఆలోచన, విజ్ఞానం పెరగటంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు అన్నారు. ఈ పార్క్ లో చిన్న పిల్లలు ఆడుకునేందుకు వీలైన ఆట పరికరాలు అందమైన గ్రీనరీతోపాటు ఊయల, జారుడు బండ, బ్యాలెన్సింగ్‌ బెంచీలు, మెరిగో రౌండ్, డక్ రైడర్, హార్స్ రైడర్, వాకింగ్‌ ట్రాక్‌, పలు జంతువుల ఆకృతుల్లో బెంచీలు, ఏర్పాటు చేస్తామని అవి పిల్లలలో ఆహ్లాదాన్ని పంచుతాయని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో వే టూ ప్లే జోన్ కాంట్రాక్టర్ భాస్కర్ రెడ్డి, కాలనీ వాసులు వెంకట రత్న కుమార్, రాంబాబు రాజు, డిఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS