SAKSHITHA NEWS

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలి

సాక్షిత ఖమ్మం :

జూనియర్ పంచాయతీ, కార్యదర్శులను వెంటనే క్రమబద్ధీకరించాలని పంచాయతీ కార్యదర్శులు మండల అధ్యక్షుడు అంబాల అంజయ్య అధ్యక్షతన శుక్రవారం కూసుమంచి మండల కేంద్రంలోని పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ని కలిశారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలు గడిచినా జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల శాంతియుతంగా సమ్మె చేస్తూ మా ఆవేదనను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి తమరి ద్వారా విన్నవించుకుంటున్నాము అని జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యూలర్ చేస్తూ జీవోను విడుదల చేయాలని, గడిచిన నాలుగు సంవత్సరాలు ప్రొబేషన్ కాలాన్ని సర్వీస్ కాలంగా గుర్తించాలన్నారు.

అదే విధంగా ప్రస్తుతం పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్యదర్శులు అందరినీ జేపీఎస్లుగా ప్రమోట్ చేస్తూ పని చేసిన కాలాన్ని ప్రొబేషన్ పీరియడ్ లో భాగంగా పరిగణించి వారిని కూడా రెగ్యులర్ చేయాలని మంత్రి కి తెలిపినారు. అందుకు కందల ఉపేందర్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ మీ సమస్యను కెసిఆర్ దగ్గరికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ బానోత్ శ్రీనివాస్ నాయక్ , డిసిసిబి చైర్మన్ ఇంటూరి శేఖర్ సానుకూలంగా స్పందించి రెగ్యులరైజేషన్ కోసం తమ వంతు మద్దతు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జేపీఎస్, ఓపీఎస్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS