*సాక్షిత కర్నూలు : వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు మరియు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల లోని ఆడపిల్లలకు ఆర్థిక సాయం ద్వారా వారికి అండగా నిలుస్తూ జనవరి నుండి మార్చి, 2023 త్రైమాసికంలో నూతనంగా వివాహం చేసుకున్న అర్హులైన 12,132 మంది లబ్ధిదారులకు రూ.87.32 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయు కార్యక్రమాన్ని సీఎం క్యాంపు కార్యాలయం నుండి ప్రారంభించిన ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి . కర్నూలు కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన , కర్నూలు శాసన సభ్యులు హఫీజ్ ఖాన్ , పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి , కోడుమూరు శాసనసభ్యులు జె.సుధాకర్ , నగర మేయర్ బివై.రామయ్య , జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి , మైనారిటీ సంక్షేమ అధికారి సభిహా పర్వీన్ , డిఆర్డిఎ పిడి వెంకట సుబ్బయ్య , గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాస కుమార్ ,లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా 574 మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయంగా రూ.4.26 కోట్లు లబ్ది