పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి డాక్టర్ రవి
పెద్దారవీడు:ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పెద్దారవీడు గ్రామంలో డాక్టర్ రవి ఆధ్వర్యంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఎప్పటికప్పుడు ఇంటి ముందు మురుగు కాలవలలో నీరు పారే విధంగా చూసుకోవాలని ఎక్కువగా దోమలు నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో పెరుగుతాయని అందువలన డ్రమ్ములలో నీటిని డ్రమ్ములపై మూతలు వేయాలని లేనియెడల పలుచటి గుడ్డతో కట్టి ఉంచాలన్నారు.
ఖాళీగా ఉన్న కొబ్బరి బోండాలను పాత టైర్లను తగలబెట్టాలని లేనిపక్షంలో వాటిలో వర్షపు నీరు నిలువ ఉండి దోమలు పెరుగుదలకు కారణమవుతాయని,నిల్వ ఉన్న నీటిలోనే ఎక్కువగా పెరుగుతాయి కావున వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకోవాలని,ప్రతి శుక్రవారం ఇంటిలోనే వాటర్ హెడ్ ట్యాంకులు మరియు కూలర్లలో నీరు ఉండకుండా చూసుకోవాలని ప్రతి ఆరోగ్య కార్యకర్త లు అన్ని గ్రామాలలోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, జ్వర పిడుతులను ముందుగానే గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నకు పంపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ సుభాని,ఆరోగ్య కార్యకర్తలు,ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.