సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన రూపాయలు (Rs.17,71,200/- ( రూపాయలు పదిహేడు లక్షల డెబ్భై ఒక వేయి రెండు వందలు) విలువ గల 42 చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులు పంపిణి చేశారు.
అనారోగ్యానికి గురైన ఆపద సమయంలో CMRF పేదలకు ఎంతో ఆర్థిక చేయూతనిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.