SAKSHITHA NEWS

వట్టిమర్తి లో ఘనంగా బొడ్రాయి పండుగ వేడుకలు

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల మండలంలోని వట్టిమర్తి గ్రామంలో నిర్వహిస్తున్న బొడ్రాయి పండుగ కు బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి ఇంటిబిడ్డగా హాజరై బొడ్రాయి పండుగలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియదర్శిని మేడి కి చీర సారె పెట్టి ఆశీర్వదించారు.గ్రామంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బొడ్రాయి మహోత్సవ కార్యక్రమం ఆహ్వానం మేరకు ప్రియదర్శిని మేడి వచ్చి బొడ్రాయి ఉత్సవంలో పాల్గొని గ్రామస్తుల్లో నూతన ఉత్సాహాన్ని తెచ్చారు. ప్రియదర్శిని మేడి రావడంతో కార్యకర్తలు కూడా అంతే నూతనోత్సాహంతో బొడ్రాయి ఉత్సవంలో పాల్గొన్నారు.గ్రామ నాయకులు స్వాగతం పలికారు. ఉత్సవ కమిటీ సభ్యులు ప్రియదర్శిని మేడి తో ప్రత్యేక పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా కన్వీనర్ మర్రి శోభ, మండల కోశాధికారి మునుగోటి సత్తయ్య,గ్రామస్తులు మేడి శ్రీను, మేడి విరస్వామి, మేఖం శేఖర్, నందిపాటి హరీష్ బిఎస్పి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS