SAKSHITHA NEWS

శ్రీ అభయ హాస్పిటల్ లో అరుదైన శాస్త్ర చికిత్స

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

శ్రీ అభయ హాస్పిటల్ లో బుధవారం నాడు అరుదైన శాస్త్ర చికిత్స జరిగిందని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఏ కరీం ఒక ప్రకటనలో తెలియజేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి గ్రామానికి చెందిన శృతిలయ(23) మహిళకి సంవత్సరం నుండి విపరీతమైన కడుపునొప్పి వస్తుంది అని వారు సూర్యాపేటలో మరియు హైదరాబాదులోని పలు హాస్పిటల్ లో చికిత్స తీసుకున్న ఉపయోగం లేకపోవడంతో వారు ఖమ్మంలోని శ్రీ అభయ హాస్పిటల్ ని సంప్రదించగా డాక్టర్ మహబూబ్ బాషా జనరల్ సర్జన్ పరీక్షించి ఆమె కడుపులో ఎడమ ఓవేరియన్ లో (లార్జ్ డర్మైడ్ సిస్ట్) 3 కేజీల కణితి ఉందని నిర్ధారించి పేషెంట్ కు తెలియజేశారు.

ఆపరేషన్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని తెలియజేసి పేషెంట్ అంగీకారంతో లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా కోత కుట్టు లేకుండా ఆ కణితి నీ రెండు గంటల పాటు శ్రమించి వైద్యులు విజయవంతంగా తొలగించారు. డాక్టర్ మహబూబ్ బాషా మాట్లాడుతూ ఆ కణితి లో జుట్టు మరియు దంతాలు ఉండటం గమనార్హం ఇలాంటివి చాలా అరుదుగా చూస్తామని చెప్పారు. ప్రస్తుతం పేషెంట్ నొప్పి నుంచి కోలుకున్నది రెండు రోజులలో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. ఈ యొక్క ఆపరేషన్ విజయవంతం చేసిన డాక్టర్ల మహబూబ్ బాషా జనరల్ సర్జన్, మత్తు డాక్టర్ విశ్వేశ్వర్ డి ఏ, మరియు ఓటి బృందాన్ని డాక్టర్ కరీం మరియు పేషంట్ యొక్క బంధువులు అభినందించారు.


SAKSHITHA NEWS