శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ఆహ్వానం
దేవరకొండ సాక్షిత ప్రతినిధి
చందంపేట మండలం పోలేపల్లి గ్రామంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో మే నెలలో నిర్వహించబోయే విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ ని ఆలయ కమిటీ ప్రత్యేకంగా ఆహ్వానించింది. మూడు రోజుల పాటు అత్యంత వైభంగా జరగబోయే ఈ కార్యక్రమంలో అనేక ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలు జరుగుతాయని కమిటీ సభ్యులు వివరించారు. ఈ సందర్భంగా దేవేందర్ నాయక్ మాట్లాడుతూ చారిత్రాత్మక, సామాజిక వైవిధ్యం కలిగిన చెన్నకేశ్వరునికి పలనాడు ప్రాంతంలో ఎంతో విశిష్టత కలిగిన దేవుడని, అనేక జానపద ఇతిహాసాలలో గొప్ప ప్రాచుర్యం కలిగిన దైవమని ఆయన కీర్తించారు. దళిత వర్గాల ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే చెన్నకేశవ స్వామి ఉత్సవాలు మన తెలంగాణ గ్రామాలలో నిర్వహించడం గొప్ప కార్యమని ఆయన అన్నారు. ఆలయ కమిటీ ఆహ్వానాన్ని మన్నించి తప్పకుండా హాజరవుతానని తెలిపారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ పట్టణ కౌన్సిలర్ గోపాలదాసు చెన్నయ్య, ఆలయ కమిటీ సభ్యులు కాలే వెంకటయ్య, ఎనిమల్ల రమేష్, చింతకుంట్ల రాకేష్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.