SAKSHITHA NEWS

సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్ లో రెపరెపలాడిన గులాబీ జెండా
భారత రాష్ట్ర సమితి ప్రతినిధుల సభ విజయవంతం
*పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి.. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *
బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు కార్య నిర్వాహక అధ్యక్షులు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి రంజిత్ రెడ్డి పిలుపు మేరకు ప్రభుత్వ విప్ మరియు స్థానిక శాసనసభ్యులు అరికపూడి గాంధీ పిలుపు మేరకు శేరిలింగంపల్లి డివిజన్ లోగల ఆయా కాలనీలలో, బస్తీలలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం 8:00 గంటల నుండి శేరిలింగంపల్లి కార్పొరేటర్, స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ జిహెచ్ఎంసి రాగం నాగేందర్ యాదవ్ సూచనల మేరకు వాడ వాడలో పండుగ వాతావరణంలో తదితర కాలనీ, బస్తీ అధ్యక్షులు, స్థానిక వాసుల సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగరవేశారు. అనంతరం కార్పొరేటర్ పార్టీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేశారు.

తదనంతరం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ నరేన్ గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన భారత రాష్ట్ర సమితి ప్రతినిధుల సభ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి రంజిత్ రెడ్డి విచ్చేసి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరావేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కలిగించి చైతన్యం తీసుకురావాలని కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. పార్టీని అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని తెలిపారు. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పాలిత రాష్ట్రాలలో కన్నా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధిలో పోటీ పడుతూ ముందువరుసలో నిలుస్తుందని అన్నారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మహిళ సంక్షేమ పథకాలు గురించి మాట్లాడుతూ షీ టీమ్స్, కేసిఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్, మిషన్ భగీరధ ఇంటింటికి నల్లా నీళ్లు, ఆరోగ్య మహిళా క్లినిక్ లు, ఒంటరి మహిళ- వితంతువు పెన్షన్ లు, బాలికల గురుకులాలు, పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు, బతుకమ్మ చీరలు, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న సీఎం గారికి ధన్యవాదాలు చెబుతూ తీర్మానం బలోపేతం చేశారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని తదితర డివిజన్ల కార్పొరేటర్ లు, తదితర డివిజన్ల అధ్యక్షులు, తదితర డివిజన్ల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, వార్డ్ మెంబర్లు, ఉద్యమకారులు, బూత్ కమిటీ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బీఆర్ఎస్ పార్టీ మహిళ నాయకురాలు, శ్రేయోభిలాషులు, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Image 2023 04 25 at 4.42.58 PM

SAKSHITHA NEWS