2 సంవత్సరాలనుండి అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని తీసివేయడం వాస్తవం కాదా… సిబ్బంది లేకుండా శిక్షణ కేంద్రం నడపగలరా…
శిక్షణ కేంద్రంలో వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి మార్పులు జరగలేదా… గత 2 సంవత్సరాల కాలం నుండి ఎంతమంది శిక్షణ పొందారో పిఓ తెలపగలరా…
కనీస సౌకర్యాలు (కరెంటు, నీరు) కూడా లేకుండా చేసినటువంటి సందర్భం నిజం కాదా… కరెంటు లేకుండా కంప్యూటర్లు నడుస్తాయా.. కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వంది…
స్వయంగా వెళ్లి పరిశీలిస్తే కళ్ళకు కట్టినట్లు నిరుపయోగం కనబడుతుంది… ఎక్కడో ఉండి నడుస్తుంది అంటే గిరిజనులను మభ్య పెట్టినట్లే…
3 కోట్ల రూపాయలతో తెలుగుదేశం పార్టీ హాయంలో నిర్మించిన గిరిజన శిక్షణ కేంద్రాన్ని నిర్వీర్యం చేయటం అనేది గిరిజనులను అణగదొక్కటమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యం…
నిరుపయోగంగా లేదు అని చెప్పడం దుర్మార్గం… ఒక ప్రభుత్వ అధికారి వైసీపీ సోషల్ మీడియా ద్వారా అబద్దం చెప్పించడం దారుణం… పిఓ ప్రభుత్వానికి వత్తాసు పలకడం ఏంటి… ఇది తాను కాదు అని చెప్పగలిగితే ఖండించాలి కదా… వైసీపీ ప్రభుత్వానికి భయపడి నిజలను దాచి కప్పిపుచ్చడం సరైనది కాదు
పిఓ కి, వైసీపీ నాయకులకు సవాల్ చేస్తున్నాం … గత రెండు సంవత్సరాలుగా (వైటిసి) గిరిజన శిక్షణ కేంద్రం ఉపయోగంగా ఉందని నిరూపిస్తే… రండి దానికి సాక్ష్యాలు చూపించండి, లేదంటే మీరు చెప్పింది అబద్ధమని ప్రకటించాలి…