SAKSHITHA NEWS

సూర్య శ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణి ….
ఒంగోలు. 20-4-23 సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు షేక్ సర్దార్ భాష. షహనాజ్ దంపతులఆధ్వర్యంలో ఒంగోలు కర్నూల్ రోడ్డులోని సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో పేద ముస్లింలకు ప్రవాస భారతీయులు సహకారంతో లక్ష రూపాయలు పైగా విలువ గల రంజాన్ తోఫా పంపిణీ చేయడమైనది.
ఈ సందర్భంగా ఏ ఆర్. ఏ ఎస్ పి అశోక్ బాబు మాట్లాడుతూ త్యాగానికి దాన ధర్మాలకు ప్రతీకగా సమస్త మానవాళి శాంతి సామరస్యంగా జీవించాలనే మహమ్మద్ ప్రవక్త సందేశంతో ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా ఉపవాసాలు ఉండి ఘనంగా పండుగ జరుపుకోవడానికి సూర్య శ్రీ ట్రస్టు పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించడం మంచి కార్యక్రమం అన్నారు .
ట్రస్టు వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ ఒంగోలు నగరం లొ నివసిస్తున్న నిరుపేద ముస్లింల అందరూ ఆనందంగా
రంజాన్ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో పండుగ కు కావలసిన . 25 కేజీల బియ్యం బస్తా. కందిపప్పు తో పాటు 10 రకాల నిత్యవసరవస్తువులు కలిపి 60 మంది ముస్లిం పేదలకు రంజాన్ తోఫా ను
పంపిణీ చేయడం జరిగింది అన్నారు .
డాక్టర్ చాపల వంశీకృష్ణ మాట్లాడుతూ సూర్యశ్రీ ట్రస్టు గత మూడు సంవత్సరాల నుంచి ఎవరూ చేయని విధంగా ఎందరో నిజమైన పేదలకు సహకారం అందించారని ఈరోజు ముస్లిం పేదలకు బియ్యం నిత్యవసర వస్తువులు అందించి మానవత్వం చాటారన్నారు.
డాక్టర్ బుడ్డపాటి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతి పండక్కు పేదలకు నిత్యవసర వస్తువులు పంపిణీ తోపాటు ఇబ్బంది పడుతున్న పేదలకు విద్య వైద్యానికి ఆర్థిక సహకారం అందించి ఆదుకుంటున్నారని అన్నారు.
ఈ సేవకార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ళ సుబ్బారావు. ట్రస్ట్ గౌరవ సభ్యులు మండవ సుబ్బారావు. సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు. శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి .మేడికొండ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు

WhatsApp Image 2023 04 20 at 7.17.39 PM

SAKSHITHA NEWS