చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న హ్యాపీనెస్, సుదర్శన క్రియ, యోగ, మెడిటేషన్ కార్యక్రమాలు పెద్దకాపర్తి గ్రామంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ సుదర్శన క్రియ ప్రోగ్రాం ల ముగింపు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ జీవితం ఆనందదాయకంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు సుదర్శన క్రియ ప్రతినిత్యం చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో మార్పు రావాలంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ద్వారా హ్యాపీనెస్ సుదర్శన క్రియ సాధనను నేర్చుకోవాలన్నారు.
ప్రపంచంలోనే అతి గొప్ప శ్వాస ప్రక్రియ సుదర్శన క్రియ అని కొనియాడారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ ఒత్తిడిని పారదోలి ఆచరణాత్మక చర్యలకు వీలు కల్పిస్తూ మన ఆరోగ్యాన్ని మరియు జీవశక్తిని పెంపొందిస్తుంది అన్నారు, ధ్యానం మరియు ఉఛ్వాస నీశ్వాసలను చక్కగా పొందుతారని తెలియజేశారు. ప్రతి ఒక్కరికి ఆనందం, ఆరోగ్యం కావాలంటే తప్పనిసరిగా సుదర్శన్ క్రియ చేయాలని దీని ద్వారా మన మనసు మన ఆధీనంలో ఉంటూ మన శ్వాస ద్వారా ఆరోగ్యాన్ని పెంచుకోగలమని తెలియజేశారు. శ్వాసను పట్టుకో ఆరోగ్యాన్ని పెంచుకో జీవితం ఆనందదాయకంగా ఉంటుందన్నారు. సుదర్శన క్రియ ద్వారా శారీరక మరియు మానసిక బలహీనత నుండి విముక్తి పొందుతారని, వ్యక్తిగత సంబంధాలను పెంపొందించుకుంటారని, రక్త పోటు, మధు మొహం, ఉబ్బసం మొదలగు రోగాలను అరికట్టవచ్చని, గుండె జబ్బులు, పక్షపాతం, మైగ్రేన్, సైనసైటిస్, చర్మవ్యాధులు గ్యాస్టిక్ సమస్యలు మరియు ఎన్నో ఒత్తిడి వల్ల వచ్చే వ్యాధులను అరికట్టవచ్చు అన్నారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ గారు ప్రపంచవ్యాప్తంగా 186 దేశాల లోని అన్ని వర్గాలవారికి 45 మిలియన్ ప్రజలకు దీని ద్వారా గొప్ప ప్రయోజనాలను పొందారన్నారు. ప్రతి ఒక్కరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా హ్యాపీనెస్ కోర్స్ చేసి ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందారు.మనసుకు శరీరానికి మధ్యలో శ్వాస ఉంటుంది ఆ శ్వాసను పట్టుకుంటే ఆనందం ఆరోగ్యం మీ సొంతమవుతుంది అని గురూజీ అన్నారు. ఈ హ్యాపీనేస్ కోర్సు ద్వారా మీ జీవితంలో కొత్త మార్పు మొదలవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యోగా టీచర్ కిషోర్, పొట్లపల్లి నరసింహ, నీలకంఠం నరేష్, మైల సత్తయ్య, నారాయణ రమేష్, జీ. నాగచారి,చంద్రయ్య, మోర ధనుంజయ్, గుండెబోయిన నరసింహ, మర్రి హరీష్ రెడ్డి, రాచమల్ల జానయ్య, లడే రాములు, ఆవుల జానయ్య వెంకటేష్, సిద్ధ గాని అశోక్, పామనగుండ్ల వెంకన్న, పాకాల దినేష్, బెలిజ సత్యనారాయణ, ఉయ్యాల లింగస్వామి, రాచమల్ల శ్రీనివాస్, మాధగొని లింగస్వామి, పాకాల సత్యనారాయణ, సిలువేరు వెంకటేష్, శిలువేరు శివయ్య తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.