SAKSHITHA NEWS

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పరిష్కార మార్గం చూపాలి.
అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్‌.మధుసూదన్‌
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పరిష్కార మార్గం చూపాలని అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్‌.మధుసూదన్‌ అధికారులకు సూచించారు. ఐడిఓసి సమావేశ మందిరం ‘‘గ్రీవెన్స్‌ డే’’లో అర్జీదారుల నుండి పలు సమస్యలపై దరఖాస్తులను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు తగు చర్య నిమిత్తం ఎండార్స్‌ చేశారు. చింతకాని మండలం కొదుమూరు గ్రామంకు చెందిన శ్రీరామ రమాదేవి, భర్త (లేటు) శ్రీనాధ్‌ 26 జూన్ 2021న కరోనాతో మరణించినారని ప్రభుత్వం నుండి అందే ఆర్ధిక సహాయం అందించగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలకై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి సూచించడమైనది. ఖమ్మం నగరం వికలాంగుల కాలనీకి చెందిన దుంగ యల్లమ్మ తన కోడలు కరోనా తో చనిపోయినదని, కొడుకు మతిస్థిమితం కోల్పోయినాడని వారి ఇద్దరు చిన్నారుల ఆలనాపాలన తానే చూసుకోవడం జరుగుతుందని ప్రభుత్వం నుండి పిల్లలకు ఆర్ధిక సహాయం అందించగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యకై జిల్లా సంక్షేమ శాఖ అధికారికి సూచించారు.

కల్లూరు మండలం యర్రబంజర గ్రామంకు చెందిన గుగులోతు రాములు తనకు గోకవరం రెవెన్యూ గ్రామంలోఖాతానెం. 738లో సర్వేనెం.61/అ/1/2, 64/1/రa/1/1, 69/ఇ లో య॥400ల భూమికి వేరొకరికి పాస్‌బుక్‌ ఇవ్వడం జరిగినదని ఇట్టి విషయంలో తనకు న్యాయం చేయగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలన చేసి తగు చర్యకై ధరణి సెక్షన్‌ అధికారికి సూచించినారు. బోనకల్‌ మండలం రాపల్లి గ్రామంకు చెందిన మన్నెపల్లి సత్యనారాయణ తనకు రాపల్లి గ్రామ రెవెన్యూ నందు సర్వేనెం.234అ1/2 100లో పట్టాభూమి వారసత్వంగా వచ్చిన మెట్ట భూమి కలదని అట్టి భూమి ప్రభుత్వ భూమిగా నమోదు కావడం జరిగినదని సరిచేసి తనకు న్యాయం చేయగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలన చేసి తగు చర్యలకై సూచించినారు. మహ్మదాపురం గ్రామంకు చెందిన గ్రామస్తులు తమ గ్రామంలో సుబ్లేడు క్రాస్‌ రోడ్‌ వద్ద వరంగల్‌ హైవే దారివద్ద సుబ్లేడు డాంబర్‌ రోడ్డుకు ఆనుకొని ఒక మీటరు వదిలి బండపట్ల శ్రీను అనే అతను రేకుల షెడ్‌ నిర్మించి బెల్టుషాపు, హోటల్‌ నిర్వహించుచున్నాడని అచ్చట పార్కింగ్‌ చేసే వాహనాల వల్ల అనేక ప్రమాదల సంభవిస్తున్నాయని అట్టి షాపును తొలగింప చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలన చేసి తగు చర్యలు చేపట్టాల్సిందిగా రహదారులు భవనాల శాఖ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజీనీరుకు సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల ఉత్పత్తిదారుల అసోసియేషన్‌ వినియోగదారులు విజయ డైరీలో నాలుగ సంవత్సరాల నుండి పాడిరైతులకు నగదు ప్రోత్సాహకం బకాయిలు కలవని, విజయ డెయిరీని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నారని అట్టి వారిపై చర్యలు తీసుకోగలరని సమర్పించిన దరఖాస్తును విచారణ చేసి తగు చర్యలకై ఖమ్మం రెవెన్యూ డివిజనల్‌ అధికారికి సూచించారు.
‘‘గ్రీవెన్స్‌ డే’’లో శిక్షణ అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాధిక గుప్తా, జిల్లా రెవెన్యూ అధికారి అర్.శిరీష, ఆర్‌.డి.ఓ రవీంధ్రనాద్‌, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS