SAKSHITHA NEWS

సాక్షితతిరుపతి:
ప్రజలకు జవాబుదారీ వ్యవస్థగా వ్యవహరించి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, ప్రజాభివృద్ధి పథకాలు వారికి అందేలా చూడడానికి సచివాలయ వ్యవస్థ వ్యవహరించాలని సచివాలయ సిబ్బందిని ఉద్దెసించి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ దామలచెరువు హరిత అన్నారు. తిరుపతి నగరంలోని ఒకటవ డివిజన్లోని ఒకటి,రెండు,మూడు వార్డు సచివాలయాలను శనివారం సాయంత్రం కమీషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులతో మాట్లాడుతూ మీయొక్క వార్డు పరిధిలోని సమస్యలను పరిష్కరించేంత వరకు మీదే బాధ్యతన్నారు.

శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ నిర్వహించడం ద్వారా డివిజన్లు చక్కగా ఉంటాయని చెబుతూ వారానికి ఒకసారన్న శానిటేషన్ వర్క్ కోసం వెళ్లే మస్టర్ పాయింట్లను కచ్చితంగా పరిశీలించాలన్నారు. తడి పొడి చెత్తను వేరువేరుగా అందించాలని ప్రజలకి అవగాహన కల్పించడంతోపాటు పారిశుద్ధ్య కార్మికుల పనితీరును కూడా మెరుగుపరిచేలా సచివాలయ శానిటేషన్ సిబ్బంది పనిచేయాలన్నారు. సచివాలయల్లో పనిచేస్తున్న వాలంటీర్ల పైన నేపంవేసి పనులను అశ్రద్ధ పెట్టకూడదన్నారు. యూజర్ చార్జీలు పెంచేలా ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవాలని సూచనలు ఇచ్చారు. అదేవిధంగా ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది తమకు కేటాయించిన యూనిఫామ్ ను కచ్చితంగా ధరించాలని, ఐడికార్డ్స్ ను ధరింప చేసుకోవాలని ముఖ్యంగా సమయపాలన పాటించాలని కమిషనర్ హరిత స్పష్టం చేసారు.


SAKSHITHA NEWS