SAKSHITHA NEWS

రంజాన్ మాసం పర్వదినం ను పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్త మహబూబ్ పెట్ ,స్టాలిన్ నగర్, MA నగర్ లలో గల మసీదు లో జరిగిన బట్టల పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముస్లిం సోదర సోదరీమణులకు బట్టలను పంపిణి చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రంజాన్ మాసం చాలా పవిత్రమైనది అని, రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రంజాన్ పర్వదినం ను పురస్కరించుకుని ముస్లిం సోదరి సోదర మణులకు పండుగను ధనిక ,పేద బేధం లేకుండా సుఖసంతోషాలతో జరుపుకునేందుకు వీలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనస్సుతో బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగినది అని, వారి కుటుంబాలలో సంతోషం వెల్లివిరియాలనే ఉద్దేశ్యంతో బట్టల పంపిణీ చేపట్టడం జరిగినది

అని ,ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలను గౌరవిస్తూ బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ, క్రిస్మస్ వేడుకలు, రంజాన్ వేడుకలకు చీరల పంపిణీ చేయడం గొప్ప విషయం అని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు అదేవిధంగా తెలంగాణకు ప్రత్యేకమైన “గంగా జమునా తెహజీబ్” మరింతగా పరిఢవిల్లాలని, రంజాన్ పండుగ ప్రజా జీవితాల్లో సుఖ సంతోషాలను అందించాలని ప్రభుత్వ విప్ గాంధీ అభిలషించారు. రంజాన్ మాసం ఉపవాసం తో మంచి తనం ,సంస్కారం అలవడుతుందని ,మతసామరస్యానికి ప్రతీక ,అందరూ కల్సి ఉండాలని ,ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టినది అని ,మానిఫెస్టోలో లేని అంశాలను కూడా ప్రవేశపెట్టినది అని ముస్లిం ల సంక్షేమానికి  ముఖ్యమంత్రి  కెసిఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని,ముస్లిం ప్రజానీకానికి ముఖ్యమంత్రి  కెసిఆర్ అండగా ఉన్నారని ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తున్నారని  ,షాదిముబారక్  పథకం ద్వారా ప్రతి పేదింటి ముస్లిం ఆడపిల్లకు  1 ,00 ,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని .మైనారిటీ గురుకుల స్కూల్స్ ను ప్రారంభించడం జరిగినది . మైనారిటీ ల సంక్షేమానికి ప్రభుత్వం  పెద్ద పీట వేస్తుందని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది,పేద ముస్లిం కుటుంబాలకు పండుగ రోజున వెలితి లేకుండా, వారికీ ఎటువంటి లోటులేకుండా పండుగను సంతోషకరంగా జరుపుకోవాలని చెప్పడం జరిగినది  .

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించేందుకు మసీదులకు ఈదుగలకు అభివృద్ధి మరమ్మతులకు నిధులు కేటాయించడం, పండుగ సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ చేయనున్నట్లు అదేవిధంగా కుల మతం జాతి భేదం లేకుండా తెలంగాణ జాతి అంతా ఒకటే అని , ఆ దేవుడి కరుణకటాక్షాలు పొందేందుకు దేవుడి కృపకు దగ్గర కాగలమనేది ప్రతి ముస్లిం సోదరుల ప్రగాఢ విశ్వాసము అందుకే ఎంతో భక్తి శ్రద్ధలతో రంజాన్ నెల మాసాన్ని పురస్కరించుకుని నియమ నిబంధనలు పాటించి ఉపవాస కఠోర దీక్షతో ప్రార్థనలు చేస్తారు. ఈ విధమైన ఆధ్యాత్మిక దైవ ప్రార్ధనలతో శాంతి, సోదరభావం, సౌభ్రాతృత్వానికి రంజాన్ ప్రతీక అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS