SAKSHITHA NEWS

పేదింటి ఆడబిడ్డల కు కల్యాణలక్ష్మీ పథకం వరం – ఎమ్మెల్యే చిరుమర్తి
కళ్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే.


నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి)


పేదింటి ఆడబిడ్డకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ఒక వరం అని ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలోని కట్టంగూర్ మండల కేంద్రంలోని ఎంఎస్ఆర్ గార్డెన్స్ లో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 154 మంది లబ్ధిదారులకు 1 కోటి 54 లక్షల రూపాయల కల్యాణ లక్ష్మీ,షాది ముబారక్ చెక్కుల పంపిణీ మరియు 28 మందికి 10 లక్షల 50 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ మన తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. పేదింటి ఆడపడుచులకు అండగా కళ్యాణలక్ష్మీ,షాది ముబారక్ పథకం నిలిచింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతీ పథకం వెనక ఓ మానవీయకోణం దాగి ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజల ముఖంలో ఆనందం చూడాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వాలు ఏనాడు పేదింటి ఆడబిడ్డల వివాహానికి డబ్బులు సహాయం చేయలేదు.
మహిళా సాధికారత మహిళల సంక్షేమ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS