SAKSHITHA NEWS

బీజేపీకి బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి…

సీఎం కేసీఆర్‌ ను ఎదుర్కొనే దమ్ము లేక కుట్రలకు దారి…

పేపర్ లీక్ తో విద్యార్థుల జీవితాలతో చెలగాటం…

దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేయాలి…

రంగారెడ్డి నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం…

ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని వైఎంఎస్ ఫంక్షన్ హాల్ లో స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ గారి అధ్యక్షతన జరిగిన రంగారెడ్డి నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఈరోజు రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇంఛార్జి, ఎమ్మెల్సీ శ్రీ డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ శంభీపూర్ రాజు గారు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సమావేశంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ అసత్య ప్రచారం చేస్తున్న బీజేపీకి బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. రాష్ట్ర పర్యటనలో ప్రధాని మోదీ ప‌చ్చి అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దూసుకెళ్తుంటే.. బీజేపీ నేతలు ‌అక్కసుతో మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ గారు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారనే అక్కసుతో బీజేపీ అనేక కుట్రలకు దారి తీస్తుందని, అటువంటి ప్రయత్నాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఇన్నేళ్లలో పేపర్ లీక్ ఎన్నడూ జరగలేదని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేపర్ లీక్ లో అడ్డంగా దొరికి నిందను ప్రభుత్వంపై తోయాలని చూస్తున్నాడని అన్నారు. బీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము లేక పేపర్ లీక్ లు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ తో పోటీ పడాలంటే తెలంగాణ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనుసరించి చూపించాలన్నారు. దేశ సంపదను ఆదానికి అంటగడుతున్న నీచులు బీజేపీ నేతలన్నారు. దేశ రాజకీయాలను మలుపుతిప్పే సత్తా గులాబీ జెండాకే ఉన్నదని బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు.

ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పార్టీకి కార్యకర్తలే శ్రీరామరక్ష అని, గడిచిన ఏళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని చెప్పారు. రాబోయే రోజుల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జయరాం, స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏర్వ శంకరయ్య, ప్రధాన కార్యదర్శి సుధాకర్ మరియు మాజీ ప్రజా ప్రతినిధులు, డివిజన్ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


SAKSHITHA NEWS