ప్రకాశం జిల్లా
శ్రీ నెమలిగుండ్ల రంగని కల్యాణ ఉత్సవ సేవలో ఎమ్యెల్యే “అన్నా”కుటుంబం…
- స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే అన్నా దంపతులు
-ఇలవేల్పు మొక్కును తీర్చుకున్న గిద్దలూరు ఎమ్యెల్యే శ్రీ అన్నా కుటుంబం
– భక్త జనంతో కిక్కిరిసిన రంగ నాయక క్షేత్రం
ప్రకృతి సోయగాల నడుమ నల్లమల అభయారణ్యంలో వెలసిన శ్రీ నెమలి గుండ్ల రంగనాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలలో గిద్దలూరు శాసన సభ్యులు అన్నా రాంబాబు గారి కుటుంబ సభ్యులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు. శుక్రవారం రంగస్వామి క్షేత్రంలో జరిగిన స్వామి వారి కల్యాణ మహోత్సవంలో గిద్దలూరు శాసన సభ్యులు అన్నా రాంబాబు గారి కుటుంబ సభ్యులు పాల్గొని స్వామి-దేవేరులకు పట్టు వస్త్రాలు, పూజా ద్రవ్యాలు సమర్పించారు. ముందుగా దేవదాయ- ధర్మధాయ శాఖ అధికారులు లాంఛనంతో తమ ఇలవేల్పు మొక్కును గిద్దలూరు ఎమ్యెల్యే శ్రీ అన్నా రాంబాబు, దుర్గాకుమారి దంపతులు మరియు కుటుంబ సభ్యులు తీర్చుకున్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవ వేడుకల కోలాహలంలో కల్యాణోత్సవం ఓ రమణీయ ఘట్టం..ఈ కల్యాణ క్రతువుకు దేవదాయ-ధర్మదాయ శాఖ తరపున, తన కుటుంబం తరపున స్వామి వారి సేవలో పాల్గొనేందుకు నల్లమల లక్ష్మమ్మ వనం చేరుకున్న ఎమ్యెల్యే అన్నా దంపతులు ఆలయ ధర్మకర్తల మండలి, ఆలయ అర్చక స్వాముల బృందం ..ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఎమ్యెల్యే అన్నా దంపతులు మరియు ధర్మకర్తల మండలి ప్రతినిధులు ముందు నడవగా…కల్యాణ విడిదిలో వేంచేసిన స్వామి, దేవేరుల ఉత్సవ మూర్తుల పల్లకీని కల్యాణ వేదికపైకి ఊరేగింపుగా తరలించారు. వేద పండితులు పాంచరాత్ర ఆగమ నియమానుసారం కల్యాణ మండపం వేదికపై స్వామి దేవేరులకు కల్యాణోత్సవాన్ని నేత్రోత్సవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయంలో ఎమ్యెల్యే దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.