SAKSHITHA NEWS

హనుమాన్ విజయ యాత్ర బందోబస్తు పై సీపీ సమీక్ష

సైబరాబాద్ : రానున్న (ఏప్రిల్ 6వ తేదీ) హనుమాన్ విజయ యాత్రను పురస్కరించుకొని బందోబస్తు ఏర్పాట్లపై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., లా అండ్ ఆర్డర్ డీసీపీలు, ఇన్స్పెక్టర్ లతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ…

రానున్న హనుమాన్ విజయ యాత్ర ర్యాలీలకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు.

ర్యాలీ లు తీసే నిర్వాహకులు ముందస్తుగా స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ లు హనుమాన్ ర్యాలీ ఆర్గనైజర్ల, యువతతో ముందుగానే పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు.

సోషల్ మీడియా లో రూమర్లు పోస్ట్ చేసే వారిపై నిఘా ఉంచామన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా అనవసరమైన గొడవలు సృష్టిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా ఉంచామన్నారు.

ట్రాఫిక్ డైవర్షన్ లు, రోడ్ క్లోజర్స్ పై దృష్టి సారించాలన్నారు.

లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పని చేయాలన్నారు.

ప్రతి ఒక్క పోలీస్ అధికారి తన జాబ్ రోల్ క్లారిటీపై స్పష్టత ఉండాలన్నారు.

ఈ సమావేశంలో సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్., జాయింట్ సీపీ ట్రాఫిక్ నారాయణ్ నాయక్, ఐపీఎస్., మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు, మేడ్చల్ డిసిపి సందీప్, రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, శంషాబాద్ డీసీపీ నారాయణ్ రెడ్డి, ఐపీఎస్., ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన్, ఐపీఎస్., ఎస్ఓటి డీసీపీ రషీద్, ఏడీసీపీలు, ఏ సీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS